
అలంపూర్ ఆలయాల్లో హైకోర్టు జడ్జి
అలంపూర్: అలంపూర్ క్షేత్ర ఆలయాలను శుక్రవారం హైకోర్టు జడ్జి ప్రవీణ్ కుమార్ కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన బాలబ్రహ్మేశ్వరస్వామి, జోగుళాంబ దేవికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శేషవస్త్రాలతో సత్కరించి అర్చక స్వాములు తీర్థ ప్రసాదాలను అందజేసి ఆశీర్వచనం పలికారు.
ఆలయాల్లో స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ పూజలు
అలంపూర్/ చిన్నచింతకుంట: దక్షిణకాశీ అలంపూర్ క్షేత్ర ఆలయాలను రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి సతీసమేతంగా గురువారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వర స్వామివార్ల దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అధికారులు శేషవస్త్రాలతో సత్కరించగా.. అర్చక స్వాములు తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వచనం పలికారు. ఆయన వెంట ఆలయ ధర్మకర్త, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాము, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి శ్యాం, నాయకులు నర్సింహ, సురేష్ న్నారు.
● కురుమూర్తిస్వామిని శివసేనారెడ్డి దంపతులు దర్శించుకుని ప్రత్యేకపూజలు చేశారు. ఈ సందర్భంగా శివసేనారెడ్డి దంపతులకు ఆలయ చైర్మన్ గోవర్ధన్‌రెడ్డి మర్యాదపూర్వకంగా ఆహ్వానించి శాలువాతో సత్కరించారు. కురుమూర్తిస్వామిని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నట్లు శివసేనారెడ్డి తెలిపారు.

అలంపూర్ ఆలయాల్లో హైకోర్టు జడ్జి