
పొలం పనులకు వెళ్తూ రైతు మృతి
మిడ్జిల్: పొలంలో వ్యవ సా య పనులు చేసేందు కు వె ళ్తూ రైతు మృతి చెందిన ఘ టన మంగళవారం మండ ల కేంద్రంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. మండల కేంద్రానికి చెంది న రాగుల బాలస్వామి (38) బుధవారం పొలంలో పంటకు మందు కొట్టేందుకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో దారిలో వరి పొలంలో ప్రమాదవశాత్తు కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు.స్థానికులు గుర్తించి పొలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టు మార్టం నిమి త్తం ఆస్పత్రికి తరలించారు.మృతుడికి భార్య మంజుల, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.
ట్రాక్టర్ ఢీకొని వ్యక్తి మృతి
మహమ్మదాబాద్: పొలం దున్నుతున్న సమయంలో ట్రాక్టర్ ఢీకొనడంతో చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. పుట్టాపహాడ్‌కు చెందిన హన్మయ్య పొలంలో చిల్ల అంజయ్య(35) ఆదివారం రాత్రి మండల పరిధిలోని ఆముదాలగడ్డ తండాకు చెందిన హన్మ్యానాయక్‌తో ట్రాక్టర్‌తో దున్నిస్తున్నాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు వెనుక ఉన్న అంజయ్యకు ట్రాక్టర్ తగలడంతో తీవ్రగాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి భార్య మాధవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మహమ్మదాబాద్ ఎస్‌ఐ శేఖర్‌రెడ్డి తెలిపారు.
విద్యుదాఘాతానికి
యువకుడి బలి
పాన్‌గల్: విద్యుదాఘాతంతో యువకుడు మృతి చెందిన ఘటన మంగళవారం మండల కేంద్రంలో చోటు చేసుకుంది. గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తెలిపి న వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెంది న మధుసూదన్‌యాదవ్ (28) విద్యుత్ శాఖలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగి (స్పాట్ బిల్లర్)గా విధులు నిర్వహిస్తున్నాడు. సబ్‌స్టేషన్ సమీపంలో రైతుల పొలాల్లోని ట్రాన్స్‌ఫార్మర్ వద్ద సమ స్య ఉందని ఆ ప్రాంత రైతులు తెలుపడంతో దానిని సరిచేసేందుకు మంగళవారం సాయంత్రం వెళ్లాడు. ఈ క్రమంలో ట్రాన్స్‌ఫార్మర్ వద్ద విద్యుత్ షాక్‌కు గురై మృత్యువాత పడ్డాడు. ఏకై క కుమారుడు అకాల మరణం చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులను వివరణ కోరగా.. ఫిర్యాదు అందలేదన్నారు.
పాముకాటుతో బాలుడి మృతి
ఎర్రవల్లి: పాము కాటుకు గురై బాలుడు మృతి చెందిన ఘటన మండల పరిధిలోని కొండపేట గ్రామంలో మంగళవారం చోటు చే సుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. గ్రామాని కి చెందిన అభిరామ్ (9) ఇంటి పరిసరాల్లో ఆ డుకుంటుండగా పాము కాటు వేసింది. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం బా లుడిని గద్వాల ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు. ఒక్కగానొక్క కుమారుడి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.
బైక్‌ను ఢీకొట్టిన బస్సు: వ్యక్తి మృతి
మహబూబ్‌నగర్ క్రైం: ముందు వెళ్తున్న బైక్‌ను వెనుక నుంచి ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో వ్యక్తికి గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. రూరల్ రెండో ఎస్‌ఐ భూపాల్ కథనం ప్రకారం.. హన్వాడ మండలం బుద్దారానికి చెందిన కమ్మరి రంగాచారి(36) మంగళవారం జడ్చర్లలో ఉన్న తమ్ముడు, తండ్రిని కలిసి తిరిగి బైక్‌పై మహబూబ్‌నగర్ వస్తుండగా మార్గమధ్యంలో తిరుమలహిల్స్ సమీపంలో ఆర్టీసీ బస్సు వెనకనుంచి బైక్‌ను ఢీకొట్టింది. కిందపడిన రంగాచారి పైనుంచి బస్సు వెనుక టైర్లు పోవడంతో తొడ భాగం పూర్తిగా నుజ్జునుజ్జు కావడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. మృతుడికి ఇద్దరూ కూతుర్లు, కొడుకు ఉన్నారు. భార్య సరిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
రెక్కీ చేసి దోచేశారు..!
మహబూబ్‌నగర్ క్రైం: జిల్లా కేంద్రంలోని గణేష్‌నగర్‌లో జరిగిన దొంగతనం కేసులో మూడు బృందాలుగా ఏర్పడి పోలీసులు మంగళవారం విస్తృత గాలింపు చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలు.. గణేష్‌నగర్‌కు చెందిన నాగేశ్వర్‌రెడ్డి కుటుంబంతో కలిసి ఈ నెల 27న తిరుపతి దర్శనానికి వెళ్లాడు. ఈ క్రమంలో ఈ నెల 29 తెల్లవారు జామున దొంగలు ఇంట్లోకి ప్రవేశించి దొంగతనం చేశారు. ఉదయం పని మనిషి ఇళ్లు శుభ్రం చేయడానికి వచ్చిన సమయంలో ఇంటి తలుపులు తెరిచి ఉండటంతో యాజమానికి సమాచారం ఇచ్చింది. బాధితుడు అతని అన్న రాజేశ్వర్‌రెడ్డికి సమాచారం ఇవ్వగా, అతను ఇంట్లో పరిశీలించగా 4 కేజీల వెండి, రూ.20 వేల నగదు అపహరించినట్లు గుర్తించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు వన్‌టౌన్ పోలీసులు, సీసీఎస్, ఫింగర్ ప్రింట్ బృందాలు విచారణ చేపట్టి అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ వాహనాన్ని గుర్తించారు. కేసు విచారణలో ఉందని త్వరలో నిందితులను పట్టుకుంటామని సీఐ అప్పయ్య పేర్కొన్నారు.

పొలం పనులకు వెళ్తూ రైతు మృతి

పొలం పనులకు వెళ్తూ రైతు మృతి