
వాగులో యువకుడు గల్లంతు
● గజ ఈతగాళ్లు గాలించిన
దొరకని ఆచూకీ
● తాళ్ల సాయంతో మహిళను
కాపాడిన స్థానికులు
దేవరకద్ర రూరల్: ఉధృతంగా ప్రవహిస్తున్న వాగు దాటేందుకు ప్రయత్నించిన ఘటనలో వ్యక్తి గల్లంతు కాగా, స్థానికుల సాయంతో మహిళ ప్రాణాలతో బయటపడిన సంఘటన మంగళవారం కౌకుంట్ల మండలంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. ఇస్రంపల్లికి చెందిన అలివేలు, మంగళి రమే ష్ (30) పనుల నిమిత్తం కౌకుంట్లకు వెళ్తున్నారు. నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షానికి రెండు గ్రామాల మధ్య ఉన్న కల్వర్టుపై నీరు ఉధృతంగా పవహిస్తుంది. అధికారులు వారిస్తున్నా.. వాగు దాటేందుకు ప్రయత్నించడంతో నీటి ప్రవా హానికి వాగులో కొట్టుకుపోయారు. ఈ క్రమంలో అలివేలమ్మ వాగు లో ఉన్న ఓ చెట్టును పట్టుకొని ఉండటంతో గమనించిన స్థానికులు తాళ్ల సాయంతో కాపాడగా, రమేష్ గల్లంతయ్యాడు. అధికారులకు సమాచారం అందడంతో ఎస్‌డీఆర్‌ఎఫ్ గజ ఈతగాళ్లతో గల్లంతైన వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఎంతకీ ఆచూకీ లభించకపోవడం, చీకటి కావడంతో గాలింపు చర్యలు నిలిపివేశారు. కాగా నిన్న ఇదే బ్రిడ్జిపై ఇస్రంపల్లికి చెందిన యువకుడు దాటేందుకని ప్రయత్నించి వాగులో కొట్టుకపోగా కౌకుంట్లకు చెందిన మల్లేష్ ప్రాణాలకు తెగించి కాపాడాడు. ఈ సంఘటనతో అధికారులు ఎవ్వరూ వాగు దాటకుండా రెండు వైపులా చర్యలు తీసుకున్నారు.
గాలింపు చర్యలు పర్యవేక్షించిన ఎమ్మెల్యే
వాగులో వ్యక్తి గల్లంతైన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని గాలింపు చర్యలను పర్యవేక్షించారు. కార్యక్రమంలో అధికారులు, నాయకులు, పాల్గొన్నారు.
గాలింపు చర్యల గురించి తెలుసుకుంటున్న ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి
వాగులో చెట్టును పట్టుకొని ఉన్న మహిళను రక్షిస్తున్న స్థానికులు

వాగులో యువకుడు గల్లంతు