
జూరాలకు భారీగా వరద
● ఎగువ నుంచి 5.37 లక్షల
క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
● ప్రాజెక్టు 39 క్రస్టుగేట్ల ఎత్తివేత
ధరూరు/రాజోళి: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద ఉధృతి పెరిగింది. ఆదివారం రాత్రి 8గంటల వరకు ప్రాజెక్టుకు 5.7లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. సోమవారం రాత్రి 8:30 గంటల వరకు 5.37లక్షల క్యూసెక్కులకు ఇన్‌ఫ్లో పెరిగినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. ఈ సీజన్‌లో ఇంత పెద్ద మొత్తంలో ఇన్‌ఫ్లో వచ్చి చేరడం ఇదే మొదటి సారి. దీంతో ప్రాజెక్టు 39 క్రస్టుగేట్లను ఎత్తి 5,60,83 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జెన్‌కో జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో విద్యుదుత్పత్తిని నిలిపివేశారు. ఆవిరి రూపంలో 41, కుడి కాల్వకు 300 క్యూసెక్కులతో కలిపి ప్రాజెక్టు నుంచి మొత్తం 5,60,524 క్యూసెక్కుల నీటిని దిగువన శ్రీశైలం ప్రాజెక్టుకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 6.310 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు.
● సుంకేసుల డ్యాంకు ఎగువ నుంచి 71,114 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రాగా.. 16 గేట్లను ఒక మీటర్ మేర తెరిచి 67,312 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నట్లు జేఈ మహేంద్ర తెలిపారు. కేసీ కెనాల్‌కు 2,012 క్యూసెక్కులు వదిలినట్లు పేర్కొన్నారు.

జూరాలకు భారీగా వరద

జూరాలకు భారీగా వరద