వాగులో కొట్టుకుపోతున్న వ్యక్తి | - | Sakshi
Sakshi News home page

వాగులో కొట్టుకుపోతున్న వ్యక్తి

Sep 30 2025 12:04 PM | Updated on Sep 30 2025 12:04 PM

వాగుల

వాగులో కొట్టుకుపోతున్న వ్యక్తి

కాపాడిన యువకుడు

దేవరకద్ర: కౌకుంట్ల, ఇస్రంల పల్లి గ్రామాల మధ్య ఉన్న వా గులో ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు కొట్టుకుపోతుండగా.. కౌకుంట్లకు చెందిన యువకుడు నీటి ప్రవాహంలో దూకి బాధితు డిని కాపాడిన ఘటన సోమ వారం జరిగింది. వివరాలు.. ఇస్రంపల్లికి చెందిన పాష పని మీద సోమవారం స్వగ్రామం నుంచి నుంచి వాగును దాటి కౌకుంట్లకు వచ్చాడు. తిరిగి గ్రామానికి వెళ్లడానికి వాగును దాటుతుండగా నీటి ప్రవాహం ఉధృతంగా కారణంగా పాష నీటిలో కొట్టుకుపోయాడు. అయితే వాగును చూడడానికి అక్కడికి వచ్చిన కౌకుంట్లకు చెందిన మల్లేశ్‌ వెంటనే అప్రమత్తం అయి వాగులోకి దూకి కొట్టుకుపోతున్న పాషను కాపాడి ఒడ్డుకు చేర్చాడు. ఎంతో ధైర్యంతో నీటి ప్రవాహంలో దూకి మరో వ్యక్తిని కాపాడినందుకు మల్లేశ్‌ను కౌకుంట్ల, ఇస్రంపల్లి గ్రామస్తులు అభినందించారు.

లింక్‌ క్లిక్‌.. రూ.1.95 లక్షలు మాయం

నాగర్‌కర్నూల్‌ క్రైం: ఫోన్‌కు వచ్చిన అనుమానాస్పద లింక్‌ను క్లిక్‌ చేయడంతో బ్యాంక్‌ ఖాతా నుంచి నగదు మాయమైన ఘటనపై కేసు నమోదైనట్లు ఎస్‌ఐ గోవర్ధన్‌ సోమవారం తెలి పారు. పూర్తి వివరాలు.. ఈ నెల 22న జిల్లా కేంద్రంలోని మటన్‌ వ్యాపారి సంపత్‌ ఫోన్‌కు వచ్చిన ఆర్టీఏ చానల్‌ లింక్‌ను క్లిక్‌ చేయడంతో బ్యాంక్‌ ఖాతాలోని రూ.1.95 లక్షల నగదు సైబర్‌ నేరస్తులు మాయం చేశారు. ఫోన్‌కు నగదు డ్రా అయినట్లు మెసేజ్‌ రావడంతో మోసపోయినట్లు గుర్తించి, ఆన్‌లైన్‌లో సైబర్‌ క్రైంకు ఫిర్యాదు చేయడంతో సోమవారం కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.

ముగ్గురు యువకుల అరెస్టు

గద్వాల క్రైం: పానీ పూరి బండి నిర్వాహకుడిపై ఆదివారం రా త్రి మద్యం మత్తులో దాడి చేసి బండి అద్దా లు ధ్వంసం చేసిన ఘటనలో ముగ్గురు యు వకులను పోలీసులు అరెస్టు చేశారు. పట్టణ ఎస్‌ఐ కల్యాణ్‌కుమార్‌ వివరాల మేరకు.. మధ్యప్రదేశ్‌కు చెందిన మంగళ్‌ గద్వాలకు వచ్చి పానీపూరి బండి ఏర్పాటు చేసుకొని ఊ పాధి పొందుతున్నాడు. పట్టణానికి చెందిన రాఘవేంద్ర అలియాస్‌ సోను, శశి, ఎస్‌కే నర్సింహాలు మద్యం సేవించి పానీపూరి తినేందుకు వచ్చారు. తిన్న తర్వాత డబ్బులు ఇచ్చే విషయంలో వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో శశి అనే యువకుడు బండి అద్దా లు ధ్వంసం చేసి, గ్యాస్‌ సిలిండర్‌ను తీసుకుని రోడ్డుపైకి విసిరేశాడు. స్థానికులు నిలువరించే ప్రయత్నం చేయగా వారిపై కూడా దాడి చేసే ప్రయత్నం చేశాడు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. రాఘవేంద్ర ఓ ఘర్షణ కేసులో జైలుకు వెళ్లి రెండు రోజుల క్రితమే బెయిల్‌పై బయటకు వచ్చాడన్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ముగ్గురిపై కేసు నమోదు చేశామన్నారు. కోర్టులో హజరు పరచి రిమాండ్‌కు తరలిస్తామన్నారు. పట్టణంలోని సీసీవై యూత్‌ యువకులు పానీపూరి బండి నిర్వాహకుడిపై దాడి చేసినట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని ఎస్‌ఐ తెలిపారు.

మనస్తాపంతో వ్యక్తి బలవన్మరణం

చారకొండ: భార్య మరణంతో మనస్తాపాని కి గురై వ్యక్తి బలవన్మరణానికి పాల్పడిన ఘట న మండలంలో చోటు చేసుకుంది. గ్రా మస్తులు, పోలీసులు తెలి పిన వివరాలు.. మండలంలోని జేపల్లికి చెందిన వంకేశ్వరం వెంకటయ్య (35) భార్య ఆరు నెలల క్రితం అనారోగ్యంతో మృతి చెందింది. ఈ నేపథ్యంలో మనస్తాపంతో వెంకటయ్య అనారోగ్యాకి గురై, అర్థిక ఇ బ్బందులతో ఆదివా రం రాత్రి ఇంట్లో పైకప్పు కు తాడుతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సోమ వారం తెల్లవారు జామున గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి ఎస్‌ఐ శంషోద్దీన్‌ చేరుకొని ఆత్మహత్యకు గల వివరాలు సేకరించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు. మృతుడికి ఒక కుమారుడు ఉన్నాడు.

వాగులో కొట్టుకుపోతున్న వ్యక్తి  
1
1/2

వాగులో కొట్టుకుపోతున్న వ్యక్తి

వాగులో కొట్టుకుపోతున్న వ్యక్తి  
2
2/2

వాగులో కొట్టుకుపోతున్న వ్యక్తి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement