
డ్రగ్స్ రహిత సమాజం కోసం బైక్ యాత్ర
చారకొండ: గంజాయి, డ్రగ్స్ రహిత సమాజం కోసం సూర్యాపేట జిల్లాకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు, సామాజిక కార్యకర్త రాచకొండ ప్రభాకర్ చేపట్టిన బైక్ యాత్ర సోమవారం చారకొండకు చేరింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గంజాయి, డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాలకు యువత బానిసై జీవితాలను నాశనం చేసుకుంటున్నారని అన్నారు. మత్తు పదార్థాలతో కలిగే అనర్థాలపై జన చైతన్యం కల్పించేందుకు ఈ నెల 21న సూర్యాపేట నుంచి బైక్ యాత్ర చేపట్టినట్లు తెలిపారు. ఇప్పటి వరకు 1400 కిలోమీటర్లు ప్రయాణించి ప్రజలను చైతన్యవంతం చేయడం జరిగిందన్నారు. యువత మత్తుకు బానిస కాకుండా ఉన్నత లక్ష్యం దిశగా ముందుకు సాగాలని కోరారు.
ట్రాఫిక్ జాంతో ఆగిన వాహనాలు
ప్రమాదంలో బోల్తా పడిన వాహనం