
సహజ వనరులను భవిష్యత్ తరాలకు అందించాలి
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: సహజ వనరులను తరువాతి తరాలకు అందించాలని పీయూ వీసీ శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ మేరకు పీయూలో బోటనీ, ఎన్విరాన్‌మెంటల్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో ‘సస్టేనబుల్ డవలప్‌మెంట్ గోల్స్’ అంశంపై ఏర్పాటు చేసిన సెమినార్‌లో ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. అభివృద్ధి జరగాలంటే సహజ వనరుల వినియోగం పూర్తిస్థాయిలో జరగాలని, వాటిద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. వాటితోపాటు పర్యావరణ పరిరక్షణతోపాటు సుస్థిరమైన అభివృద్ధి జరగాలని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతిఒక్కరూ కనీసం 10 మొక్కలను నాటాలని, వాటిని కాపాడే బాధ్యతను కూడా తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ రమేశ్‌బాబు, ఓయూ ప్రొఫెసర్ పురుషోత్తంరెడ్డి, పీజీ కళాశాల ప్రిన్సిపాల్ మధుసూదన్‌రెడ్డి, అర్జున్‌కుమార్, గాలెన్న, బృందాదేవి, రాణెమ్మ, వేణు, శ్రీనివాసులు పాల్గొన్నారు.
పీయూ వీసీ శ్రీనివాస్