
అందుబాటులో ఉంచాలి
చెంచు పెంటల్లోని చెంచులకు ప్రతినిత్యం ఆరోగ్య సేవలు అందుబాటులో ఉండే విధంగా అప్పాపూర్‌లో ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయాలి. వైద్య శిబిరాలు ఏర్పాటు చేసినప్పుడే రోగాలు రావాలని లేదు. ఉపాధి కోసం తరచుగా అడవిలోకి వెళ్లినప్పుడు అనారోగ్యం భారిన పడే ప్రమాదం ఉన్నందున్న అప్పాపూర్‌లో కేంద్రం ఏర్పాటు చేస్తే అందరికీ మంచిగా ఉంటుంది.
– నడిపి లింగయ్య, భౌరాపూర్ పెంట
అందుబాటులోనే ఉంటున్నాం
కొంతకాలంగా పీహెచ్‌సీలో 24 గంటలు రోగులకు అందుబాటులో ఉంటూ వైద్యసేవలు అందిస్తున్నాం. అదేవిధంగా పరిస్థితులను బట్టి, ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం తరచుగా చెంచుపెంటల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తూ వైద్యం అందుబాటులో ఉంచుతున్నాం. పరిస్థితులను బట్టి మరిన్ని సేవలు అందించేందుకు కృషిచేస్తాం.
– సుధాకర్, వైద్యాధికారి, మన్ననూర్ పీహెచ్‌సీ
●