
వ్యక్తి ఆత్మహత్య
మక్తల్: ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన పట్టణంలో చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయనగరం జిల్లా బొ బ్బిలి మండలం పిరిడికి చెందిన శ్రీనివాసనాయుడు(45) పట్టణంలో నివాసముంటూ కర్ణాటక శక్తినగర్‌లోని శిల్ప కంపెనీలో పని చేస్తున్నాడు. ఈ క్రమంలో గురువారం విధులు ముగించుకొని ఇంటికి వచ్చాడు. భార్య విజయ పిల్లలతో కలిసి భూ లక్ష్మమ్మ ఆలయానికి వెళ్లి తిరిగి వచ్చేలోపు శ్రీనివాసనాయుడు ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహ త్య చేసుకున్నాడు. మృతుడి సోదరుడు నవీన్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని మక్తల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. శుక్రవారం పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఎస్‌ఐ భాగ్యలక్ష్మీరెడ్డి తెలిపారు. మృతుడికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
బైక్ అదుపుతప్పి వ్యక్తి దుర్మరణం
● తండ్రి మరణించిన
5 రోజులకే కుమారుడు సైతం..
గోపాల్‌పేట: బైక్ అదుపుతప్పి చెట్టును ఢీకొట్టడంతో వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని తాడిపర్తిలో శుక్రవారం రాత్రి జరిగింది. స్థానికుల కథనం మేరకు.. నాగర్‌కర్నూల్ జిల్లా వడ్డెమాన్ గ్రామానికి చెందిన ఏటవాలు రవి(37) వనపర్తికి బైక్‌పై వెళ్తుండగా తాడిపర్తి వద్ద అదుపుతప్పి రోడ్డు పక్కనున్న చెట్టును ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్రగాయాలపాలైన రవిని స్థానికులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఐదు రోజుల క్రితమే మృతుడి తండ్రి మరణించినట్లు తెలిసింది. ప్రమాదంపై గోపాల్‌పేట ఎస్‌ఐ నరేష్‌కుమార్ వివరణ కోరగా ఎలాంటి ఫిర్యాదు అందలేదని పేర్కొన్నారు.
రోడ్డు ప్రమాదంలో గాయాలు.. కేసు నమోదు
తిమ్మాజిపేట: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తికి గాయాలయ్యాయి. ఏఎస్‌ఐ సాయి నిర్మలాదేవి వివరాల ప్రకారం.. పూర్తి వివరాలు వివరాలు.. బిజినేపల్లికి చెందిన మునవరోద్దీన్ ఈ నెల 25న గ్రామం నుంచి జడ్చర్లకు తన మిత్రుడితో కలిసి బైక్‌పై వెళ్తున్నాడు. మార్గ మధ్యలో తిమ్మాజిపేట పెట్రోల్ బంకు సమీపంలో వెంకటేష్ అనే వ్యక్తి వస్తున్న బైక్‌ను ఎదురెదురుగా ఢీకొన్నాయి. ప్ర మాదంలో గాయపడిన మునవరోద్దీన్‌ను చికిత్స నిమిత్తం హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. బాధితుడి సోదరుడి అంజత్ ఫిర్యాదు మే రకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్‌ఐ తెలిపారు.
కుక్క అడ్డు రావడంతో..
గండేడ్: కుక్క అడ్డం రావడంతో బైక్ అదుపుతప్పి తండ్రి కొడుకులకు గాయాలయ్యాయి. పూర్తి వివరాలు.. మండలంలోని పెద్దవార్వాల్ కు చెందిన ఆశన్న, కుమారుడు మల్లేశ్ శుక్రవా రం మధ్యాహ్నం బైక్‌పై జక్లపల్లి నుంచి పెద్దవార్వాల్ వెళ్తున్నారు. ఈ క్రమంలో జక్లపల్లి రాయికుంట వద్ద కుక్క అడ్డుగా రావడంతో బైక్ అదుపుతప్పి ఇద్దరు కిందపడ్డారు. ప్రమాదంలో మల్లేశ్‌కు ఎడమ కాలు విరగ్గా ఆశన్నకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానికులు 108లో జిల్లా ఆస్పత్రికి తరలించారు.