
పండుగకై నా జీతం ఇవ్వాలి
జీతం రాక ఇబ్బంది అవుతుంది. పండుగలు దగ్గర పడుతున్నయి. దసరా పండుగకై నా జీతాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలి. సారోళ్లు మా గురించి కొంచెం ఆలోచించాలి. మబ్బుల వచ్చి రోడ్లు ఉడుస్తున్నాం. కాల్వలు తీస్తున్నాం. ప్రతి నెలనెలా జీతం ఇచ్చేలా చూడాలి. పానం బాగోలేకపోతే పెద్ద దవాఖానాలో ఉచితంగా వైద్యం చేపించుకునే అవకాశం కల్పించాలి.
– పెంటయ్య, కార్మికుడు, చౌదర్‌పల్లి
నెలనెలా వేతనాలివ్వాలి..
పారిశుద్ధ్య కార్మికుల త రఫున నిరంతరం పోరా టం చేస్తున్నాం. గతంలో ఎస్‌టీఓల ద్వారా జీతాలు ఇచ్చేవారు. ఇప్పుడు కొత్త విధానంతో వేతనాలు ఇవ్వడం మొదలుపెట్టారు. ఇకనైనా నెలనెలా వేతనాలు ఇస్తే బాగుంటుంది. కార్మికుల జీవితాలు చిన్నవి. జీతాలు వస్తేనే వారి కుటుంబాలను పోషించుకుంటారు. గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలి.
– సి.వెంకటేశ్, టీయుసీఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు
క్రమబద్ధీకరించాలి..
గ్రామ పంచాయతీలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులను క్రమబద్ధీకరించాలి. 2011 జనాభా ప్రకారం గ్రామాల్లో కార్మికులను పెట్టుకుంటున్నారు. ఒక్క రికి ఇచ్చే జీతంలో ఇద్దరిని సమానంగా పంచుకోవాలనే నిబంధనను తొలగించాలి. ఆరోగ్య భద్రత కోసం ఈఎస్‌ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించాలి. కార్మి కులకు ఐడీ కార్డులను ఇవ్వాలి. ప్రతి 500 జనాభాకు ఒక కార్మికుడిని నియమించుకోవాలనే దానికనుగుణంగా వేతనమివ్వాలి. – ఆంజనేయులు,
పంచాయతీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్
●

పండుగకై నా జీతం ఇవ్వాలి

పండుగకై నా జీతం ఇవ్వాలి