
న్యాయవాద రక్షణ చట్టాన్ని అమలు చేయాలి
పాలమూరు: న్యాయవాదులపై జరుగుతున్న దాడులకు ప్రత్యామ్నాయంగా న్యాయవాద రక్షణ చట్టాన్ని వెంటనే అమల్లోకి తీసుకురావాలని బార్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్‌రావు డిమాండ్ చేశారు. నాగర్‌కర్నూల్ బార్ అసోసియేషన్ సభ్యుడు సాయికుమార్‌పై జరిగిన హత్యాయత్నానికి నిరసనగా జిల్లా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం విధులు బహిష్కరించి కోర్టు నుంచి ర్యాలీ తెలంగాణ చౌరస్తా వరకు నిర్వహించి అక్కడ నిరసన వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో ఉన్న న్యాయవాదులపై జరుగుతున్న దాడులను ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు. ఇటీవల రాష్ట్రంలో చాలా వరకు న్యాయవాదులపై దాడులు, హత్యాయత్నాలు పెరిగిపోతున్నాయని తెలిపారు. న్యాయవాదిపై దాడి చేసిన వారిని అరెస్టు చేసి ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ద్వారా విచారణ చేయాలన్నారు.