మార్కింగ్ చేసినవి,ఇందులో పనుల ప్రగతి ఇలా..
60.95%గ్రౌండింగ్
51.36%పనుల ప్రగతి
అధికంగా బేస్‌మెంట్ దశలోనే..
ఉమ్మడి పాలమూరులోని మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, నారాయణపేట, జోగుళాంబ గద్వాల, వనపర్తి జిల్లాల్లో మొత్తం 40,404 ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి. ఇందులో అధికారులు 25,899 ఇళ్లకు మార్కింగ్ (గ్రౌండింగ్ పూర్తి) చేశారు. వీటిలో అత్యధికంగా 13,486 ఇళ్లు బేస్‌మెంట్.. 2,544 ఇళ్లు గోడలు, రూఫ్ లెవల్‌లో.. 978 ఇళ్ల పనులు స్లాబ్ దశలో కొనసాగుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో ఇప్పటివరకు 11 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు మాత్రమే పూర్తయ్యాయి. మహబూబ్‌నగర్ జిల్లాకు సంబంధించి దేవరకద్ర నియోజకవర్గ పరిధిలోని మూసాపేట, మీనబోయినపల్లి, జడ్చర్ల మండలం మల్లెపల్లి గ్రామంలో ఒక్కొక్కటి చొప్పున మూడు ఇళ్ల నిర్మాణాలు పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు. వనపర్తి జిల్లాలో ఐదు, నారాయణపేట జిల్లాల్లో రెండు, నాగర్ కర్నూల్ జిల్లాలో ఒక ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తయినట్లు తెలుస్తోంది.
అట్టడుగున వనపర్తి..
ఉమ్మడి జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్.. అంటే మంజూరైన వాటిలో మార్కింగ్/గ్రౌండింగ్ చేసిన వాటికి సంబంధించి శాతాలను పోలిస్తే నారాయణపేట జిల్లా మొదటిస్థానంలో ఉంది. ఆ తర్వాత స్థానాల్లో వరుసగా మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి.. చివరగా గద్వాల జిల్లా నిలిచింది. గ్రౌండింగ్ అయిన వాటిలో వివిధ దశల్లో కొనసాగుతున్న నిర్మాణాలకు సంబంధించి పనుల పురోగతిలో ఇప్పటివరకు మహబూబ్‌నగర్ జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత నాగర్‌కర్నూల్, నారాయణపేట, గద్వాల జిల్లాలు నిలవగా.. వనపర్తి జిల్లా అట్టడుగున ఉంది.