
రమణీయం.. రాములోరి కల్యాణం
ఎర్రవల్లి: శ్రీరాముని జన్మనక్షత్రమైన పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకొని బీచుపల్లి పుణ్యక్షేత్రంలోని కోదండరామస్వామి ఆలయంలో బుధవారం సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు సీతారాములను అపురూపంగా ముస్తాబు చేసి వేద మంత్రాల నడుమ కల్యాణం రమణీయంగా జరిపించారు. కల్యాణ కార్యక్రమాన్ని తిలకించేందుకు ఆలయ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. భక్తులు ఉదయా న్నే బీచుపల్లికి చేరుకొని పవిత్ర కష్ణానదిలో పుణ్యస్నానాలను ఆచరించి భక్తిశ్రద్ధలతో సీతారాముల క ల్యాణంలో పాల్గొని కనులారా తిలకించారు. కల్యాణానికి హాజరైన భక్తులకు ఆలయ పాలక మండలి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించా రు. కార్యక్రమంలో ఆలయ మేనేజర్ సురేందర్‌రా జు, అర్చకులు భువనచంద్ర, దత్తుస్వామి, భానుమూర్తి, పాలక మండలి సభ్యులు, భక్తులు, పాల్గొన్నారు.