
పొట్టేలు కోసం వెళ్తూ.. మృత్యు ఒడిలోకి
● ఆటోను ఢీకొట్టిన లారీ: భర్త,
మరోవ్యక్తి దుర్మరణం
● భార్యకు గాయాలు, ఆస్పత్రికి తరలింపు
● ఆర్తనాదాలతో మార్మోగిన ఆస్పత్రి పరిసరాలు
వనపర్తి రూరల్: పెద్దల పండుగ కోసం బంధువుల వద్ద పొట్టేలును తీసుకొచ్చేందుకు వెళ్తూ మృత్యు ఒడికి చేరిన ఘటన వనపర్తి మండలం నాచహళ్లి వద్ద బుధవారం చోటుచేసుకుంది. ఆటోను లారీ ఢీకొట్టిన ఘటనలో భర్త, మరోవ్యక్తి దుర్మరణం చెందగా.. భార్యకు గాయాలయ్యాయి. స్థానికుల కథ నం ప్రకారం.. వనపర్తి మండలం నాచహళ్లికి చెందిన పాలెమోని రవి(35) కూరగాయల వ్యాపారి. పెద్దల పండుగ ఉండడంతో పెబ్బేరులోని బంధువుల వద్ద పొట్టేలును తీసుకొచ్చేందుకు భార్య సరోజ, వనపర్తిలోని పీర్లగుట్ట తిరుమలకాలనీకి చెందిన పెబ్బేటి తెలుగురాజు(38)తో కలిసి బుధవారం మధ్యాహ్నం నాచహళ్లి నుంచి ఆటోలో బయలుదేరారు. మార్గమధ్యంలో లిరిక్స్ రైస్‌మిల్లు వద్ద పెబ్బేరు నుంచి అతివేగంగా వస్తున్న లారీ ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో నుజ్జునుజ్జయి రవి, రాజు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. సరోజ ఆటోలోంచి కిందపడిపోవడంతో గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ జలంధర్‌రెడ్డి సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను వనపర్తి ఆస్పత్రి మార్చురీ, క్షతగాత్రురాలిని ఆస్పత్రికి తరలించారు. ఆయా గ్రామాల్లో విషాదఛాయలు అమలుకున్నాయి. మృతుల బంధువులు, ,గ్రామస్తులు ఆస్పత్రి వద్దకు చేరుకోవడంతో పరిసరాలు ఆర్తనాదాలతో నిండిపోవడంతో పలువురిని కంటతడి పెట్టించాయి.

పొట్టేలు కోసం వెళ్తూ.. మృత్యు ఒడిలోకి

పొట్టేలు కోసం వెళ్తూ.. మృత్యు ఒడిలోకి

పొట్టేలు కోసం వెళ్తూ.. మృత్యు ఒడిలోకి