
ఉవ్వెత్తున ఎగిసిన ఉద్యమం
నారాయణపేట: నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పాలమూరు ప్రజలు సాగించిన పోరులో నా రాయణపేట ఆర్యసమాజ్ కీలకపాత్ర పోషించింది. 1947–49 కాలంలో కర్రలు, కత్తులే ప్రధాన ఆయుధాలుగా ఉద్యమాలు కొనసాగించారు. రజాకార్లు ఉద్యమ నేతలను తుపాకులతో కాల్చి చంపడంతో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. ఉమ్మడి పాలమూరులో ఎంతోమంది పోరాట యోధులను జైలుకు పంపి ఉద్యమాన్ని అణిచివేసే ప్రయత్నం చేశారు. 1948 సంవత్సరానికి ముందు జిల్లాలో నిజాం పాలనకు వ్యతిరేకంగా ఎన్నో ఉద్యమాలు జరిగా యి. ప్రజల్లో వచ్చిన చైతన్యంతో నిజాం పాలకులు ఈ ప్రాంతాన్ని విడిచి వెళ్లినట్టు ప్రచారం జరు గుతోంది.
ఖాసీం రజ్వీ పాలనలో..
అప్పట్లో ఖాసీం రజ్వీ అనే రజాకారు నారాయణ పేట ప్రాంతంలో ఓ బృందాన్ని ఏర్పాటు చేసుకొని మతమార్పిడి చేసేందుకు పూనుకోవడంతో ఉద్యమాలు జరిగినట్లు పెద్దలు చెబుతున్నారు. మొదట్లో మతమార్పిడి కొంతమేర జరిగినా.. తర్వాతి కాలంలో ఉద్యమకారులు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆర్యసమాజ్ నేతృత్వంలో పెద్దఎత్తున పోరాటాలు చేశా రు. కాలక్రమేణ స్వాతంత్య్రం కోసం రజాకర్లను ఎదుర్కొనేందుకు సన్నద్ధమయ్యారు. తమ వద్ద పదునైన ఆయుధాలు లేకపోవడంతో కత్తి, కర్ర సా ములో యువతకు ప్రత్యేక శిక్షణనిచ్చి తీర్చిదిద్దారు.
యజ్ఞంతో ఏకం చేస్తూ..
ఆర్యసమాజ్ ఆధ్వర్యంలో తృతీయ మహాసభల పేరిట గ్రామీణ ప్రాంతాల్లో యజ్ఞం పేరుతో అందరిని ఒకే వేదికపైకి తీసుకొస్తూ ఉద్యమాలు కొనసాగించారు. ఆ సమయంలో ఆర్యసమాజ్ సభలు, స మావేశాలు నిర్వహించేందుకు నిజాం పాలకులు అ నుమతినిచ్చే వారు కాదు. లోక కల్యాణార్థం మహారాష్ట్రాలోని సోలాపూర్ ఆర్యసమాజ్ కేంద్రంగా గ్రామాల్లో ప్రత్యేకంగా యజ్ఞాలు నిర్వహిస్తున్నట్లు నిజాం పాలకులను నమ్మించడంలో సఫలీకృతులయ్యారు. యజ్ఞాల పేరిట ప్రజలను ఒకచోట చేర్చి అవసరమైన ప్రణాళికలు రూపొందించారు.
సుండికే వారి ఇంటి నుంచే పాలన..
నారాయణపేట దర్గా రోడ్‌లోని సుండికే వారి ఇంటి నుంచే రజాకార్లు పాలన సాగించినట్లు పెద్దలు చెబుతున్నారు. ఇక్కడే ఉంటూ తమకు వ్యతిరేకంగా ఎవరు ఉద్యమించినా అక్కడికి తీసుకెళ్లి శిక్షించే వారన్నారు. ప్రాణాలను లైక్కచేయక జైలులో ఉండి అనారోగ్యానికి గురైనట్లు తెలిపారు.
వేలాదిగా తరలివచ్చిన యువత..
1944లో నిజాం పాలనకు వ్యతిరేకంగా నారాయణపేటలో హైదరాబాద్‌కు చెందిన సూరజ్ చంద్రోజీ, పండిత్ నరేంద్రజీ, నారాయణపేటకు చెందిన రాంచందర్‌రావు కల్యాణి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించేందుకు సన్నద్ధమయ్యారు. ర్యాలీ అనంతరం స్థానిక శాతవాహనకాలనీ ప్రాంతంలో ప్రత్యేక సమావేశం నిర్వహించాలని ఉద్యమకారులు ప్రతిపాదించారు. ర్యాలీకి నిజాం పాలకులు అనుమతి ఇవ్వకపోవడంతో మొదట్లో అంతంత మాత్రంగా వచ్చిన జనం తర్వాత కట్టలు తెగిన ఉత్సాహంతో తరలివచ్చి నిజాం పాలకులకు వ్యతిరేకంగా చేపట్టిన ర్యాలీలో పాల్గొని విజయవంతం చేశారు.
కత్తులు కర్రలే ఆయుధాలుగా ఆర్యసమాజ్ పోరాటం
మతమార్పిడికి వ్యతిరేకంగా
కదనరంగంలోకి
1944లో నారాయణపేటలో భారీ ర్యాలీ
సుండికే వారి ఇంటి నుంచే
రజాకార్ల పాలన

ఉవ్వెత్తున ఎగిసిన ఉద్యమం