
జూరాలకు కొనసాగుతున్న ఇన్‌ఫ్లో
● ప్రాజెక్టు 12 క్రస్టు గేట్ల ఎత్తివేత
● ఆరు యూనిట్లలో కొనసాగుతున్న
విద్యుదుత్పత్తి
ధరూరు: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వస్తున్న ఇన్‌ఫ్లో నిలకడగా కొనసాగుతున్నట్లు పీజేపీ అధికారులు తెలిపారు. సోమవారం ప్రాజెక్టుకు 1.20 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. మంగళవారం రాత్రి 8.30 గంటల వరకు ప్రాజెక్టుకు వస్తున్న ఇన్‌ఫ్లో 1,18,500 క్యూసెక్కులకు తగ్గినట్లు తెలిపారు. దీంతో ప్రాజెక్టు 12 క్రస్టు గేట్లను ఎత్తి గేట్ల ద్వారా 83,484 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నెట్టెంపాడు ఎత్తిపోతల్లో ఒక పంప్‌ను ప్రారంభించి నీటిని ఎత్తిపోస్తున్నారు. జెన్‌కో జల విద్యుత్ కేంద్రంలో ఆరు యూనిట్లలో విద్యుదుత్పత్తిని కొనసాగిస్తునట్లు జెన్‌కో అధికారులు తెలిపారు. విద్యుదుద్పత్తి కోసం 37,008, నెట్టెంపాడుకు 750, ఆవిరి రూపంలో 46, భీమా లిఫ్టు–1కు 650, ఎడమ కాల్వకు 550, కుడి కాల్వకు 490, భీమా లిఫ్టు–2కు 750 క్యూసెక్కులు ప్రాజెక్టు నుంచి మొత్తం 1,22,978 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి మట్టం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 8.531 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు పీజేపీ అధికారులు పేర్కొన్నారు.
నిరంతరాయంగా విద్యుదుత్పత్తి
ఆత్మకూర్: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ కర్నాటక నుంచి వరద భారీగా చేరుతుండడంతో దిగువ, ఎగువ జూరాల జలవిద్యుదుత్పత్తి కేంద్రాల్లో ఉత్పత్తి వేగవంతంగా కొనసాగుతుంది. ఈ మేరకు మంగళవారం 12 యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తిని చేపట్టినట్లు ఎస్‌ఈ శ్రీధర్ తెలిపారు. ఎగువలో 6 యూనిట్ల ద్వారా 234 మెగావాట్లు, 334.026 ఎంయూ, దిగువలో 6 యూనిట్ల ద్వారా 240 మెగావాట్లు, 359.114 మిలియన్ యూనిట్ల ఉత్పత్తిని చేపడుతున్నారు. ఎగువ, దిగువ జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో ఇప్పటి వరకు 693.140 ఎంయూ విజయవంతంగా విద్యుదుత్పత్తిని చేపట్టినట్లు పేర్కొన్నారు.