
బైక్ అదుపు తప్పి వ్యక్తి దుర్మరణం
మిడ్జిల్: బైక్ అదుపు తప్పి కిందపడి వ్యక్తి మృతిచెందిన ఘటన మంగళవారం మండలంలోని కొత్తపల్లి సమీపంలోని జాతీయ రహదారి పై చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. మిడ్జిల్ మండలంలోని చిల్వేర్‌కు చెందిన జక్కా అనిల్‌కుమార్(30) పనిమీద జడ్చర్లకు మోటార్‌సైకిల్‌పై వెళ్తూ కొత్తపల్లి సమీపంలో అదుపుతప్పి రోడ్డుపైన నిలిచి ఉన్న బొలేరోను ఢీకొట్టడంతో బలమైన గాయాలలై అక్కడికక్కడె మృతిచెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం జడ్చర్ల ఆస్పత్రికి తరలించినట్లు ఎస్‌ఐ శివనాగేశ్వర్‌నాయడు తెలిపారు. మృతుడికి భార్యతోపాటు ముగ్గురు పిల్లలు ఉన్నారు.
రోడ్డు ప్రమాదంలో
వ్యక్తి మృతి
వనపర్తి రూరల్: గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన మంగళవారం మండలంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. మండలంలోని రాజపేట వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొని మతిస్థిమితం లేని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రి మార్చురీకి తరలించారు.
డ్రంకెన్‌డ్రైవ్‌లో
లారీ డ్రైవర్‌కు జైలుశిక్ష
మహబూబ్‌నగర్ క్రైం: మద్యం తాగి వాహనం నడిపిన లారీ డ్రైవర్‌కు న్యాయమూర్తి జైలు శిక్షతోపాటు జరిమానా విధించారు. వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్‌ఐ శీనయ్య ఆధ్వర్యంలో చేసిన డ్రంకన్‌డ్రైవ్‌లో లారీ డ్రైవర్ బెస్త మహేశ్ మద్యం తాగి లారీ నడుపుతున్నట్లు గుర్తించారు. అతనికి బ్రీత్ అనలైజర్ ద్వారా చేసిన పరీక్షల్లో ఏకంగా 550శాతం ఆల్కహాల్ తాగినట్లు నిర్ధారణ కావడంతో మంగళవారం కోర్టులో హాజరుపరచగా.. న్యాయమూర్తి నిర్మల లారీ డ్రైవర్ మహేశ్‌కు రెండు రోజుల జైలు శిక్షతోపాటు రూ.3వేల జరిమానా విధించారు. దీంతో వన్‌టౌన్ పోలీసులు సదరు వ్యక్తిని జిల్లా జైలుకు తరలించారు.
తాళం వేసిన ఇంట్లో చోరీ
కేటీదొడ్డి: ఇంటి తాళం పగులగొట్టి బంగారం, వెండి చోరీ చేసిన ఘటన మండలంలోని చింతలకుంట గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన గుడిసె ఆంజనేయులు మంగవారం ఇంటికి తా ళం వేసి పొలానికి వెళ్లాడు. సాయంత్రం పను లు ముగించుకొని ఇంటికి వచ్చి చూడగా తా ళం పగులగొట్టి తలుపులు తెరిచి ఉండాటాన్ని గమనించాడు. బీరువా పగులకొట్టి రెండు తులాలున్నార బంగారం, వెండి, నగదు చోరీ జరిగినట్లు బాధితుడు తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపారు.
గుర్తు తెలియని
మృతదేహం లభ్యం
ఆత్మకూర్: మండలపరిధిలోని జూరాల గ్రామశివారులోని కృష్ణనది ఒడ్డున గుర్తు తెలియని మృతదేహం లభించినట్లు ఎస్‌ఐ నరేందర్ తెలిపారు. మంగళవారం మత్స్యకారులు చేపల వేటకు వెళ్లగా మృతదేహం కనిపించడంతో సమాచారం అందించినట్లు తెలిపారు. మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి ఉండడంతో దాదాపు 10 నుంచి 15 రోజుల క్రితం వరదనీటిలో కొట్టుకు వచ్చి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. ఆనవాళ్లు తెలసిన వారు ఎవరైనా ఉంటే ఆత్మకూర్ పోలీసులను సంప్రదించాలని పేర్కొన్నారు.
డీసీఎం బైక్ ఢీ:
యువకుడికి గాయాలు
వీపనగండ్ల: మండల కేంద్రానికి సమీపంలోని గోవర్ధనగిరి రహదారిలో మంగళవారం సా యంత్రం డీసీఎం, బైక్ ఢీకొన్న ఘటనలో బొల్లారానికి చెందిన కుందేళ్ల నాగరాజు తీవ్రంగా గాయపడ్డాడు. కొల్లాపూర్ నుంచి పెబ్బేర్‌కు వెళ్తున్న డీసీఎం పల్లె ఆంజనేయస్వామి దేవాలయ సమీపంలో ఎదురుగా వస్తున్న బైక్ ఢీకొనడంతో బైక్‌పై ఉన్న ఫొటోగ్రాఫర్ నాగరాజు మోకాలికి బలమైన గాయం కావడంతో 108లో పెబ్బేరు ఆస్పత్రికి తరలించారు.
లారీ, కారు ఢీ
వనపర్తి రూరల్: ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి కారు ఢీకొట్టడంతో కారులో ఉన్న వారికి స్వల్ప గాయాలైన సంఘటన పెబ్బేరు మండలంలోని జాతీయ రహదారిపై మంగళవారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ యుగేంధర్‌రెడ్డి తెలిపి న వివరాలు.. హైదరాబాద్‌కు చెందిన అన్నపురెడ్డి శ్రీనివాసరావు కుటుంబ సభ్యులతో కలిసి కారులో హైదరాబాద్ నుంచి బెంగూళూర్‌కు బయలు దేరాడు. మార్గమధ్యలో పెబ్బేరు మండలంలోని జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న లారీని సడన్ బ్రేక్ వేయడంతో వెనుకాల వస్తున్న కారు లారీని ఢీకొట్టింది. కారులో బెలూన్స్ ఓపెన్ కావడంతో డ్రైవింగ్ చేస్తున్న సతీష్ చంద్ర, పక్క సీటులో కూర్చున్న యశ్వంత్ చంద్రకు రక్తగాయాలయ్యాయి. బాధితుడు అన్నపురెడ్డి శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు లారీ డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.