
వరంగల్ జైలులో 50 రోజులు ఉన్నా..
నవాబుపేట: సాయుధ పోరాటంలో విద్యార్థిదశ నుంచే ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నా. తరగతిగదిలో సైతం తెలంగాణ విషయంలో ఎక్కువగా వాదిస్తే అణచివేత ఉండేది. రాజాకార్ల సైన్యం ప్రయాణించే బస్సును నిలిపివేసి దహనం చేశాం. ఈ ఘటనలో నాతో పాటు చాలామందిపై కేసులు నమోదు చేశారు. వారం పాటు వెతికి చివరకు అరె స్టు చేిశారు. 50 రోజుల పాటు వరంగల్ జైలులో ఉన్నా. అనంతరం బెయిల్‌పై వచ్చినా ఉద్యమ పంఽథా వీడ లేదు. నిజాం పాలన నుంచి తెలంగాణకు విముక్తి పొందిన సమయంలో నాకు 27 ఏళ్లు. అప్పటి సంతోషం, సంబురం చెప్పలేనివి.
– రంగారావు, నవాబుపేట