
ఉత్సవాలు జరపాలి..
నిజాం కాలంలో వందలాది మంది ని బందీలుగా తీ సుకువచ్చి నాటి కాలాపాని జైలు లో ఉంచేవారు. నాటి చరిత్రకు ఆనవాళ్లుగా ఉన్న జై లుఖానాపై ప్రభుత్వం దృష్టిపెట్టి స్మారకంగా అభివృద్ధి చేయాలి. సెప్టెంబర్ 17న అధికారికంగా జైలు ప్రాంగణంలో ఉత్సవాలు నిర్వహించాలి.
– సంబు వెంకటరమణ, వీహెచ్‌పీ
జిల్లా ఉపాధ్యక్షుడు, నాగర్‌కర్నూల్
నేటి తరానికి తెలిసేలా..
నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా, దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన వారిని మన్న నూర్ జైలులో శిక్షించారు. ఇక్కడి కాలా పాని నీళ్లు తాగితే సచ్చిపోతారని ఉద్యమకారుల ను భయపెట్టేవారు. జైలు చరిత్రను నేటి తరానికి తెలిసేలా, వెలుగులోకి తెచ్చేలా అభివృద్ధి చేయాలి.
– తుమ్మల నారాయణరెడ్డి,
మన్ననూర్
●

ఉత్సవాలు జరపాలి..