
గద్దర్ విగ్రహం ఏర్పాటు చేయాలి
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): జిల్లా కేంద్రంలో ప్రజాయుద్ధనౌక, తెలంగాణ ఉద్యమ కారుడు గద్దర్ విగ్రహం ఏర్పాటు చేయాల విగ్రహ ఏర్పాటు కమిటీ సభ్యులు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డికి మంగళవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ప్రజా యుద్ధనౌక గద్దర్ విగ్రహ ఏర్పాటు కమిటీ కన్వీనర్ గోపాల్, కో కన్వీనర్లు కృష్ణముదిరాజ్, మైత్రియాదయ్య మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు గద్దర్ సాంస్కృతి ఉద్యమాన్ని నిర్మించారని తెలిపారు. అలాంటి వ్యక్తి ఆశయాలు భావితరాలకు అందించాల్సిన అవసరం ఉందన్నారు. భావితరాలకు పరిచయం చేయడం కోసం జిల్లా కేంద్రంలో గద్దర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో కోకన్వీనర్లు ప్రవీన్, గోపాల్, రవికిరన్, మురళి, చందుయాదవ్, శ్రీనివాస్, శ్రీను, వెంకట్‌స్వామి, సంజీవ్, తిరుపతయ్య, రామలింగం పాల్గొన్నారు.
పీయూ ఈసీ
హెచ్‌ఓడీగా రామరాజు
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనిర్సిటీలో నూతనంగా ప్రారంభించిన ఇంజినీరింగ్ కళాశాల హెచ్‌ఓడీగా పండగ రామరాజు నియమిస్తూ వీసీ శ్రీనివాస్ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు రామరాజు మాస్టర్ డిగ్రీ ఓయూ నుంచి, పీహెచ్‌డీ బిట్స్ పిలానీ, ఐఐఐటీ మద్రాస్‌లో పోస్టు డాక్టోరల్ ఫెల్లోషిప్‌ను పూర్తి చేసి, పీయూలో ఇటీవల అధ్యాపకుడిగా చేరారు. హెచ్‌ఓడీగా నియమించినందుకు వీసీకి రామరాజు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ రమేశ్‌బాబు, ఆడిట్‌సెల్ డైరెక్టర్ చంద్రకిరణ్ పాల్గొన్నారు.
కలెక్టర్‌కు ఆహ్వానం..
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పీయూలో వచ్చే నెల 16న నిర్వహించే స్నాతకోత్సవ కార్యక్రమానికి రావాలని మహబూబ్‌నగర్ కలెక్టర్ విజయేందిరకు వీసీ శ్రీనివాస్, రిజిస్ట్రార్ రమేష్‌బాబు ఆహ్వాన పత్రిక అందజేశారు.
వ్యక్తి అదృశ్యం..
కేసు నమోదు
తెలకపల్లి: వ్యక్తి అదృశ్యమైన ఘటనపై మంగళవారం కేసు నమోదైంది. ఎస్‌ఐ నరేష్ తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రానికి చెందిన అజమోని వెంకటేష్ (31) చేపల వ్యాపారంలో నష్టపోయాడు. ఈ నెల 13న ఇంట్లో ఎవరికి చెప్పకుండా వెళ్లాడు. ఎంత వెతికినా ఆచూకీ లభ్యం కాకపోవడంతో పోలీస్ స్టేషన్‌లో అతని తల్లి అజమోని తిరుపతమ్మ ఫిర్యాదు చేసింది. ఈమేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తునట్లు ఎస్‌ఐ తెలిపారు.

గద్దర్ విగ్రహం ఏర్పాటు చేయాలి