
జక్లేర్‌కు చెందిన కిషన్‌రావు, శ్రీనివాసరావు, ఉత్తం వెం
రజాకార్లు గ్రామాల్లో మహిళలపై చేస్తున్న ఆకృత్యాలు, ఇళ్లలో చేస్తున్న దోపిడీలను సహించలేక జక్లేర్‌కు చెందిన కిషన్‌రావు, శ్రీనివాసరావు, ఉత్తం వెంకప్ప తిరుగుబాటు చేయడంతో వారిని బంధించి గుల్బర్గ జైలుకు తరలించారు. 1947, ఆగస్టు నుంచి 1948, జూన్ వరకు సుమారు 11 నెలలు జైలులోనే ఉండగా.. విడుదలైన తర్వాత ఆదోని క్యాంపునకు తరలించారు. 1952 తర్వాత జక్లేర్ బస్టాండ్ వద్ద కాంగ్రెస్ జెండా ఎగురవేసి 3 రోజుల పాటు 5వ మహాసభలు నిర్వహించారు.
మక్తల్: భారతదేశంలో వి లీనం చేసేందుకు ఏ డో ని జాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఒప్పుకోకపోవడంతో బానిస సంకెళ్ల నుంచి తెలంగాణాకు విముక్తి కల్పించేందుకు అప్పట్లో మక్తల్ నియోజ కవర్గంలో ఉన్న నారాయణపేటకు చెందిన న్యా యవాది రాఘవేందర్‌రావు పోరాటం సాగించారు. నిజాం వ్యతిరేక పోరాటానికి అప్పటి కాంగ్రెస్‌పార్టీ పిలుపునివ్వడంతో ఉమ్మడి జిల్లా నుంచి దాదాపు 300 మంది స్వాత్రంత్య్ర సమరయోధులు ముందుకురాగా.. వారికి రాఘవేందర్‌రావు నాయకత్వం వహించారు. ఆయన తన అనుచరులతో పోలీస్‌స్టేషన్లపై దాడులు, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం, ఆయుధాలు ఎత్తుకెళ్లడంతో పాటు భూమి పన్ను చెల్లించరాదని ప్రజలకు పిలుపునిచ్చారు. రాఘవేందర్‌రావును పట్టుకుంటే 5 వేల ఉస్మానియా చిక్కా నజరానా ఇస్తామని నిజాం పాలకులు ప్రకటించారు. అయినా చిక్కకపోవడంతో ఆయన తమ్ముడు శ్రీనివాసరావును అరెస్టు చేసి జైలులో బంధించారు. అప్ప టి నుంచి రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటం చేసిన రాఘవేందర్‌రావు పనితీరును పలువురు అభినందించారు. ప్రాణాలను లెక్కచేయకుండా రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. పేటలోనే ఉమ్మడి జిల్లా 4వ సదస్సు నిర్వహించారు. 1999, మే 22న రాఘవేందర్‌రావు మృతిచెందారు.
కిషన్‌రావు
శ్రీనివాసరావు

జక్లేర్‌కు చెందిన కిషన్‌రావు, శ్రీనివాసరావు, ఉత్తం వెం

జక్లేర్‌కు చెందిన కిషన్‌రావు, శ్రీనివాసరావు, ఉత్తం వెం