
విద్యుత్ కార్మికుల పక్షాన పోరాడుతాం
● 1104 రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిబాబా
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్) : విద్యుత్ కార్మికుల పక్షాన యూనియన్లు నిరంతరం పోరాటం చేయాలని విద్యుత్ ఉద్యోగుల 1104 యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిబాబా అన్నారు. మంగళవారం స్థానిక జేజేఆర్ ఫంక్షన్‌హాల్‌లో విద్యుత్ ఎంప్లాయీస్ 1104 సర్కిల్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులకు ఎలాంటి కష్టం వచ్చిన వారి తరఫున పోరాటం చేయాలన్నారు. కార్మికుల హక్కులను కాపాడిన నాడే యూనియన్లకు మనుగడ ఉంటుందన్నారు. విద్యుత్‌శాఖ ఉద్యోగులు, కార్మికులకు తాము అండగా ఉంటామని, వారి సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. ఏ సమస్య వచ్చిన తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఎన్నికై న నూతన అధ్యక్ష కార్యదర్శులు కార్మికుల సమస్యలు తెలుసుకుని ఎప్పటి సమస్యలు అప్పుడే పరిష్కరించేందుకు చొరవ చూపాలన్నారు. అనంతరం జిల్లా కమిటీని ఎన్నుకోగా జిల్లా అధ్యక్షుడిగా స్వామి, జిల్లా కార్యదర్శిగా పాండు, అదనపు కార్యదర్శిగా సోమేష్‌లు ఎన్నికయ్యారు. కార్యక్రమంలో విద్యుత్ ఉద్యోగుల 1104 యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి వరప్రసాద్, టీజీఎస్పీడీసీఎల్ డిస్కం అదనపు కార్యదర్శి భాస్కర్‌రెడ్డి, వెంకన్న, జనార్థన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.