
సరస్వతీదేవి ఆలయంలో హుండీ చోరీ
మరికల్: మండల కేంద్రంలోని సరస్వతీ దేవి ఆలయంలో గుర్తు తెలియని దుండగులు హుండీ చోరీ చేసిన ఘటన శుక్రవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రాయిచూర్ రోడ్డు పక్కన ఉన్న సరస్వతీదేవి ఆలయంలో శుక్రవారం అర్ధరాత్రి సమయంలో ఆలయంలోకి చొరబడి హుండీ తాళం పగలగొట్టి అందుల్లో ఉన్న డబ్బులను ఎత్తుకెళ్లారు. శనివారం ఉదయం పూజ కార్యక్రమాలు నిర్వహిస్తుండగా గమనించిన భక్తులు ఈ విషయాన్ని పోలీసులకు తెలిపారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు హుండీని పరిశీలించారు. సీసీ కెమెరాలను పరిశీలించినా దొంగల ఆచూకీ లభించలేదు. దొంగలను పట్టుకుంటామని ఏఎస్‌ఐ ఎల్లయ్య తెలిపారు. ఇదే ఆలయంలో హుండీ చోరీకి గురికావడం రెండోసారి కావడంతో భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ధాన్యం లారీ పట్టివేత
వనపర్తి రూరల్: పెబ్బేరు మండలం వై శాఖాపూర్ నుంచి వరిధాన్యం తరలిస్తున్న లారీని పోలీసులు పట్టుకొని స్టేషన్‌కు తరలించారు. ఎస్‌ఐ యుగేందర్‌రెడ్డి వివరాల మేరకు.. వై శాఖాపూర్‌లోని అమల ట్రేడింగ్ ఇండస్ట్రీస్ నుంచి శుక్రవారం అర్ధరాత్రి లారీలో 385 బ్యాగుల సన్నరకం వడ్లను కర్ణాటకు తరలిస్తున్నారని పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు దాడులు నిర్వహించారు. తోమాలపల్లి వద్ద లారీని పట్టుకొని స్టేషన్‌కు తరలించారు. శనివారం డీఎస్‌ఓ కాశీవిశ్వనాథానికి సమాచారం అందించగా.. పౌరసరఫరాలశాఖ డిప్యూటీ తహసీల్దార్ పరమేశ్ లారీలోని వడ్లను తనిఖీ చేశారు. వడ్ల శాంపిల్ సేకరించినట్లు డీటీ తెలిపారు.
ముగ్గురు వ్యక్తులపై
కేసు నమోదు
లింగాల: దాడికి పాల్పడిన తోకల రవి, బునా ద్రి సాయి, గుత్తి శ్రీనులపై కేసు నమోదు చేసిన ట్లు ఎస్‌ఐ వెంకటేశ్వర్‌గౌడు శనివారం తెలిపా రు. మండలంలోని అప్పాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని పుల్లాయపల్లి పెంటకు చెందిన తోకల లింగయ్యపై, తోకల నడిపి బాలమ్మపై అదే పెంటకు చెందిన తోకల రవి ఈ నెల 8వ తేదీన అకారణంగా దాడి చేసి గాయపర్చాడు. మండల కేంద్రంలోని ఓ చికెన్ సెంటర్ వద్ద ఈ నెల 11న రాత్రి బునాద్రి సాయి, గుత్తి శ్రీనులు ఇరుకు సుధాకర్‌పై దాడికి పాల్పడ్డారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఆయా ఘటనలకు బాధ్యులైన వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
కీచక ఉపాధ్యాయుడు
మహబూబ్‌నగర్ క్రైం: మహబూబ్‌నగర్ మండ లం ధర్మాపూర్ పాఠశాలలో ఇటీవల జరిగిన ఘటనను మర్చిపోకముందే మరో ప్రభుత్వ పాఠశాలలో దారుణం చోటుచేసుకుంది. బాలబాలికలకు విద్యాబుద్ధులు నేర్పించి ఉన్నతంగా తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయుడు కీచకుడిగా మారాడు. గత రెండేళ్లుగా ఓ విద్యార్థినిని మానసికంగా, ఇతర రూపాల్లో వేధింపులకు గురిచేస్తూ వచ్చాడు. కీచక ఉపాధ్యాయుడి వేధింపులు భరించలేక బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. వన్‌టౌన్ సీఐ అప్ప య్య వివరాల మేరకు.. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ఓ ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న రమేశ్ రెండేళ్ల నుంచి అదే పాఠశాలలో చదువుతున్న ఓ విద్యార్థినిని వేధింపులకు గురిచేస్తున్నాడు. ఇటీ వల భద్రాచలం టూర్ వెళ్లిన నాటి నుంచి సదరు విద్యార్థినిపై ఉపాధ్యాయుడి వేధింపులు మరింత పెరిగాయి. డబ్బులు ఆశ చూపడంతో పాటు ఇతర మార్గాల్లో ఆ విద్యార్థినిని లోబర్చు కోవాలని ప్రయత్నాలు చేశాడు. దీంతో పాటు అసభ్య పదజాలం ఉపయోగిస్తూ నిత్యం ఇబ్బందులకు గురిచేశాడు. ఉపాధ్యాయుడి వేధింపులు భరించలేక విద్యార్థిని తన తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో పోలీసులను ఆశ్రయించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదు చేశారు. శనివారం అతడిని అరెస్టుచేసి కోర్టులో హాజరుపర్చగా.. రిమాండ్‌కు తరలించినట్లు సీఐ వెల్లడించారు.
చికిత్స పొందుతూ
వ్యక్తి మృతి
గోపాల్‌పేట: పురుగుల మందుతాగి ఆస్పత్రిలో చికి త్స పొందుతూ మృతి చెందిన ఘటన చోటు చేసుకున్నది. రేవల్లి హెడ్‌కానిస్టేబుల్ చంద్రశేఖర్ తెలిపిన వివరాల మేరకు.. రేవల్లి మండలంలోని తల్పునూరు గ్రామానికి చెందిన మద్దిలేటి సురేష్ (35) ఆగస్టు 27న అప్పులబాధ ఎక్కువైందని, ఆవేదన కు గురై పురుగుల మందు తాగగా స్థానికులు గుర్తించి నాగర్‌కర్నూల్ ఆస్పత్రిలో చేర్పించారు. శనివా రం చికిత్స పొందుతూ సురేష్ మృతి చెందాడు. మృతుడి అన్న శేఖర్ ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన ట్లు వివరించారు. సురేష్ భార్య మూడేళ్ల క్రితం మరణించింది. తన ఇద్దరు కూతుర్లను పెంచలేక, అప్పుల బాధ భరించలేక మృతి చెందాడని గ్రామస్తులు తెలిపారు.
పాలమూరులోని ఓ పాఠశాల
విద్యార్థినితో అసభ్యకర ప్రవర్తన
పోక్సో కేసు నమోదు.. రిమాండ్