
జూరాలకు పెరిగిన ఇన్‌ఫ్లో
● 1.57లక్షల క్యూసెక్కుల వరద
● 18 క్రస్టు గేట్ల ఎత్తివేత
ధరూరు/ఆత్మకూర్: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు శనివారం రాత్రి 9 గంటల వరకు 1.57 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తున్నట్లు పీజేపీ అధికారులు తెలిపారు. దీంతో ప్రాజెక్టు 18 క్రస్టు గేట్లను ఎత్తి 1.27 లక్షల క్యూసెక్కులు, విద్యుదుద్పత్తి నిమిత్తం 35,259 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 47 క్యూసెక్కులు, ఎడమ కాల్వకు 550 క్యూసెక్కులు, కుడి కా ల్వకు 260 క్యూసెక్కులు కలిపి ప్రాజెక్టు నుంచి మొ త్తం 1.63 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 8. 909 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఈ సందర్భంగా 12 యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తి చేపట్టినట్లు ఎస్ ఈ శ్రీధర్ తెలిపారు. ఎగువలో 6 యూనిట్ల ద్వారా 234 మెగావాట్లు, దిగువలో 6 యూనిట్ల ద్వారా 240 మెగావాట్లు విద్యుదుత్పత్తిని చేపడుతున్నారు.
సంగంబండ రిజర్వాయర్ గేట్ ఎత్తివేత
మక్తల్: కర్ణాటక సమీపంలోని ఇడ్లూర్ పెద్దవాగు నుంచి నీటి ప్రవాహం అధికం కావడంతో చిట్టెం నర్సిరెడ్డి బ్యాలెన్సింగ్ సంగంబండ రిజర్వాయర్ ఒక గేట్ ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసినట్లు ఇరిగేషన్ డీఈ సురేష్ తెలపారు.