
ట్రస్మా వెల్ఫేర్ ఫండ్‌కు రూ.10లక్షలు
● ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి
● ట్రస్మా ఆధ్వర్యంలో ప్రైవేట్
ఉపాధ్యాయులకు సన్మానం
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: ట్రస్మా వెల్ఫేర్ ఫండ్‌కు తన తరఫున రూ.10లక్షలు ఇస్తామని ఎమ్మె ల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. జిల్లావ్యాప్తంగా ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉత్తమ ఉపాధ్యాయులకు తెలంగాణ ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలోని ఏఎస్‌ఎన్ గార్డెన్‌లో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎమ్మెల్యే యెన్నం ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. వెనుకబడిన జిల్లాగా ఉన్న పాలమూరుకు ఇంజినీరింగ్, లా, ఐఐఐటీ కళాశాలల ను తీసుకొచ్చామని, వాటిద్వారా ఇక్కడి విద్యార్థులకు విద్య, ఉపాధి అవకాశాలు మెరుగుపడతా యని తెలిపారు. అంతేకాకుండా ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ఆరోగ్య బీమా కల్పించాల్సిన అవసరం ఉందని, ప్రతి ఉద్యోగి రూ.250, యాజమాన్యం రూ.250 చెల్లిస్తే నిధి తయారవుతుందన్నారు. రెండురోజులపాటు విద్య మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ట్రస్మా కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో టీపీసీసీ అధికార ప్రతినిధి హర్షవర్ధన్‌రెడ్డి, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి, ఆనంద్‌గౌడ్, మధుసూదన్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, క్రాంతికుమార్, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు లక్ష్మణ్, వంశీమోహన్, కిరణ్మయి, రిషి కళాశాలల చైర్మన్ చంద్రకళావెంకటయ్య, లక్ష్మణ్‌గౌడ్, విజేత వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.