
జడ్చర్లకు మరో విద్యాహారం
జడ్చర్ల: విద్యారంగంలో దూసుకెళ్తున్న జడ్చర్లకు మ రో విద్యాహారం లభించింది. ఇప్పటికే జడ్చర్ల– మ హబూబ్‌నగర్ పరిధిలో ఐఐఐటీ మంజూరు కాగా.. బాలానగర్ మండలంలోని పెద్దాయపల్లి గ్రామం వద్ద రూ.150 కోట్లతో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్‌కు శంకుస్థాపన జరిగింది. తా జాగా కేంద్ర ప్రభుత్వం ఇదే పెద్దాయపల్లి వద్ద జవహార్ నవోదయ విద్యాలయం ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు శుక్రవారం నవోదయ విద్యాలయం మంజూరు చేస్తూ ఆ శాఖ జాయింట్ కమిషనర్ సమీర్‌పాండే ఉత్తర్వులు జారీ చేశారు.
20 ఎకరాలు కేటాయింపు..
బాలానగర్ మండలంలో 44వ నంబర్ జాతీయ రహదారిని అనుసరించి ఉన్న పెద్దాయపల్లి గ్రామ శివార్లలో సర్వే నంబర్లు 40, 42లలో 20 ఎకరాల ప్రభుత్వ భూమిని నవోదయ విద్యాలయ భవనం నిర్మించేందుకు కేటాయించారు. ఇప్పటికే ఇక్కడ దాదాపు రూ.150 కోట్లతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి రాష్ట్ర ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. దీంతో ప్రతిష్టాత్మకమైన రెండు విద్యాసంస్థల ఏర్పాటుకు పెద్దాయపల్లి గ్రామం కేంద్రబిందువుగా మారింది. ఇక మరో ప్రతిష్టాత్మకమైన ఐఐఐటీ 44వ నంబర్ జాతీయ రహదారిని అనుసరించి జడ్చర్ల– దివిటిపల్లి మధ్య ఏర్పాటు కానుండటంతో జడ్చర్ల ఎడ్యుకేషన్ హబ్‌గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఎంపీ, ఎమ్మెల్యే కృషితో..
మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ నవోదయ స్కూల్ మంజూరుకు కృషి చేయడం, ఇందుకు పెద్దాయపల్లి వద్ద 20 ఎకరాల భూమిని ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి కేటాయించడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. త్వరితగతిన ఇక్కడ ఆయా విద్యాసంస్థల ఏర్పాటుకు సంబంధించి భవన నిర్మాణాలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
తాత్కాలికంగా ఏర్పాటు
ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే నవోదయ వి ద్యాలయాన్ని ప్రారంభించేందుకు ఆదేశాలు జారీ అయ్యాయి. పెద్దాయపల్లి వద్ద భవనం నిర్మించే వరకు తాత్కాలికంగా మహబూబ్‌నగర్ శివారు లోని బండమీదిపల్లి వద్ద గల దుర్గాభాయి మహి ళా శిశువికాస్ కేంద్రంలో నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు విద్యార్థులకు కావాల్సిన తాగునీరు, మరుగుదొడ్లు తదితర మౌ ళిక సదుపాయాలు కల్పించాలని పేర్కొన్నారు.
నవోదయ పాఠశాలమంజూరు చేసిన ప్రభుత్వం
ఇప్పటికే రూ.150 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్, ఐఐఐటీ ఏర్పాటు
పెద్దాయపల్లి వద్ద 20 ఎకరాలలో నెలకొల్పేందుకు చర్యలు
ఈ విద్యా సంవత్సరం నుంచే అందుబాటులోకి..
తాత్కాలికంగా బండమీదిపల్లి వద్ద నిర్వహణ ప్రారంభం

జడ్చర్లకు మరో విద్యాహారం