
పేద విద్యార్థులకు వరం
పెద్దాయపల్లి వద్ద ఒకవైపు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, మరోవైపు జవహర్ నవోదయ విద్యాలయం ఏర్పాటు చేయడం హర్షనీయం. ఇలాంటి స్కూల్స్ ఏర్పాటు వలన ఎంతో మంది పేద విద్యార్థులకు లాభం కలుగుతుంది. అన్ని వసతులతో నాణ్యమైన విద్యను అందించే అవకాశం ఉంటుంది. ఇందుకు కృషిచేసిన ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డికి కృతజ్ఞతలు.
– శంకర్, మాజీ సర్పంచ్, పెద్దాయపల్లి
విద్యారంగంపై దృష్టి..
జడ్చర్లను ఎడ్యుకేషనల్ హబ్‌గా తీర్చిదిద్దుతాం. తమ ప్రభుత్వం వచ్చాక విద్యారంగంపై ప్రత్యేకంగా దృష్టిసారించింది. అందులో భాగంగానే పెద్దాయపల్లి వద్ద రూ.150 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్, జడ్చర్ల శివారులో ఐఐఐటీ ఏర్పాటు చేసింది. వీటికి తోడు ఎంపీ డీకే అరుణ కృషితో నవోదయ విద్యాలయం మంజూరైంది. విద్యారంగం అభివృద్ధికి మరింత కృషిచేస్తాం.
– అనిరుధ్‌రెడ్డి, ఎమ్మెల్యే, జడ్చర్ల
●

పేద విద్యార్థులకు వరం