
చికిత్స పొందుతూ యువకుడు మృతి
ఊట్కూరు: జీవనోపాధికై పేయింటింగ్ పనిచేస్తూ ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి చికి త్స పొందుతూ కుర్వ మల్లేశ్(25) మృతిచెందిన ఘటన మండలంలోని అమీన్‌పూర్‌లో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కొంటి సైబన్న కుమారుడు కుర్వ మల్లేశ్ కొంతకాలంగా ఇళ్లకు పెయింటింగ్ వేసేవాడు. వారం రోజుల క్రితం పగిడిమారిలో కుర్వ బాలరాజు ఇంటికి పెయింటింగ్ వేయడానికి కూలీ పనికి వెళ్లాడు. అక్కడ ప్రమాదవశాత్తు విద్యుత్ వైర్‌లు తగలడంతో కిందపడిపోయాడు. మహబూబ్‌నగర్ ఎస్‌వీఎస్ ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడ పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతిచెందాడు. ఈ విష యమై ఎస్‌ఐ రమేశ్‌ను వివరణ కోరగా తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు.
బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలి
పేయింటింగ్ పనిచేస్తూ మృతిచెందిన మల్లేశ్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని భారతీయ కిసాన్ సంగ్ నాయకులు మైపాల్‌రెడ్డి, వెన్‌కోబా, నాగార్జున ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.
గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి దుర్మరణం
కృష్ణా: మండంలోని గుర్జాల్ గ్రామానికి చెందిన శంకర్ (29) ఆదివారం తెల్లవారుజామున టై రోడ్‌లో బస్సు దిగి నడచుకుంటూ వస్తుండగా వెనుక నుంచి గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహం గుర్తుపట్టని విధంగా నుజ్జునుజ్జు కావడంతో వాహనదారులు పోలీసులకు సమా చారం అందించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ఎండీ నవీ ద్ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమి త్తం మక్తల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఆగిన లారీని కారు ఢీ: వ్యక్తి మృతి
వనపర్తి రూరల్: ఆగిన ఉన్న లారీని కారు ఢీకొట్టడంతో ఓ వ్యక్తికి మృతి చెందడంతో పాటు ఒకరికి గాయాలయిన ఘటన శనివారం అర్ధరాతి పెబ్బేరు మండలంలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ యుగేంధర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కర్నూల్‌కు చెందిన దూదేకుల చిన్న కాశీంసాబ్ (37)షాద్‌నగర్ శివారులోని ఎంఎస్‌ఎన్ ల్యాబ్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. శనివారం రాత్రి షాద్‌నగర్ నుంచి భార్య పద్మప్రియతో కలిసి ఆయన కారులో కర్నూల్‌కు వెళ్తుండగా.. రంగాపురం శివారులోని జాతీయ రహదారి 44పై సందర్శిని హోటల్ వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో దూదేకుల చిన్న కాశీంసాబ్ తల, ముఖానికి బలమైన గాయాలై అక్కడిక్కడే మృతి చెందాడు. భార్య పద్మప్రియ ఎడమ కాలు విరిగడంతో పాటు ముఖానికి రక్త గాయాలు కాగా 108 అంబులెన్స్‌లో వనపర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి కర్నూల్ కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. మృతుడి అన్న దూదేకుల ఖాసీం పెబ్బేరు పోలీసుస్టేషన్‌లో ఆదివారం ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.
పురుగుల మందు తాగి వ్యక్తి బలవన్మరణం
మరికల్: మతిస్థిమితం సరిగా లేని ఓ వ్యక్తి క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన పల్లెగడ్డ గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని పల్లెగడ్డకు చెందిన కాటేకొండ రాములు(48) వ్యవసాయ పొలానికి వెళ్లి వస్తానని భార్య లక్ష్మితో చెప్పి ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడు. పొలం దగ్గరకు వెళ్లిన ఆయన దోస తోట కోసం తెచ్చి న పురుగుల మందును తాగి అపస్మారక స్థితి లో చేరుకున్నాడు. గమనించిన భార్య చుట్టుపక్కల రైతుల సహకారంతో మరికల్‌లోని ఆస్పత్రికి తీసుకొచ్చారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సూచన మేరకు మహబూబ్‌నగర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఏఎస్ మజీద్ తెలిపారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు.