
జూరాలకు బారులుదీరారు
జూరాల ఎడమ కాల్వ వద్ద వాహనదారులతో మాట్లాడుతున్న సీఐ శివకుమార్
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు సందర్శకులతో కిటకిటలాడింది. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో 19 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. దీంతో జల పరవళ్లను తిలకిస్తూ.. ప్రాజెక్టు అందాలను మొబైల్ ఫోన్లలో చిత్రీకరించేందుకు పోటీపడ్డారు. ఆదివారం సెలవురోజు కావడంతో స్థానికులతోపాటు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి పెద్దఎత్తున సందర్శకులు తరలిరావడంతో కిలోమీటర్ మేర ట్రాఫిక్ జాం అయ్యింది. అలాగే చేపల వంటకాలను రుచి చూసేందుకు పర్యాటకులు ఆసక్తి చూపారు. ఇదిలా ఉండగా.. జూరాల ప్రాజెక్టుకు భారీ వరద వస్తుండడంతో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా వనపర్తి ఎస్పీ రావుల గిరిధర్ ఆదేశాల మేరకు సీఐ శివకుమార్ ఆధ్వర్యంలో ఆత్మకూరు రెండో ఎస్‌ఐ హిమబిందు 50 మంది పోలీసులతో గట్టి భద్రతను ఏర్పాటు చేశారు. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తూ.. ప్రజలు ప్రమాదకర ప్రాంతాల్లోకి వెళ్లకుండా చర్యలు చేపట్టారు. – అమరచింత (ఆత్మకూర్)

జూరాలకు బారులుదీరారు

జూరాలకు బారులుదీరారు