
నల్లమలలో ట్రెక్కింగ్
మన్ననూర్: అచ్చంపేట వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం మన్ననూర్ నుంచి ఉమామహేశ్వరం వరకు అటవీ మార్గంలో ట్రెక్కింగ్ నిర్వహించారు. స్థానిక వనమాళికా ప్రాంగణం నుంచి ట్రెక్కింగ్‌కు సిద్ధమైన వాకర్స్‌కు అటవీ మార్గంలో పాటించాల్సిన నియమ నిబంధనలను ఫారెస్టు ఎడ్యుకేషనల్ అధికారిణి శ్వేత వివరించారు. అక్కడి నుంచి సహజసిద్ధమైన ప్రకృతిని ఆస్వాదిస్తూ అటవీ మార్గంలో ఉమామహేశ్వరం వరకు ట్రెకింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా వాకర్స్ అసోసియేషన్ ఫౌండర్ చందు నాయక్, డిప్యూటీ తహసీల్దార్ రమేశ్ మాట్లాడుతూ.. అటవీ మార్గంలో ప్రతి అడుగులోనూ నూతనోత్సాహం కలిగిందన్నారు. ట్రెక్కింగ్ సమయంలో వన్యప్రాణులైన చిరుత, పెద్ద పులి అడుగు జాడలు కనిపించినట్లు చెప్పారు. ట్రెక్కింగ్ సమయంలో గైడ్‌గా వ్యవహరించిన ఎఫ్‌ఆర్‌ఓ సుబ్బు, బీఎఫ్‌ఓ ఆశ, అటవీశాఖ సిబ్బంది ప్రశాంత్, ప్రభాస్, పరుశురాం, ఆంజనేయులు వన్యప్రాణుల జీవన శైలి, వృక్ష సంపద తదితర అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ రఘునందన్, హెచ్‌ఎం బిచ్చా నాయక్, రిటైర్డ్ హెచ్‌ఎం నర్సోజీ, అశోక్ ప్రసాద్, నిరంజన్, హన్మంత్, రాములు, భాస్కర్, ఖదీర్, ఖాదర్, జమీర్, కాశీలింగం, ప్రమోద్, లక్ష్మీకాంత్, సాయిరాం, హరికృష్ణ, రమేశ్, స్వామి, మాధవాచారి, పుల్లయ్య, నర్సింహ, శివశంకర్, హరి, శ్రీకాంత్, లక్ష్మణ్, హన్య, ప్రకాష్, మల్లేష్, సాదిక్, సత్యం, క్రాంతి పాల్గొన్నారు.
అభయారణ్యంలో ట్రెక్కింగ్ చేస్తున్న వాకర్స్