
అధ్యాపక పోస్టుల కోసం దరఖాస్తుల ఆహ్వానం
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: జిల్లాకేంద్రంలోని ఎన్టీఆర్ మహిళా డిగ్రీ కళాశాలలో ఖాళీగా ఉన్న అధ్యాపకుల పోస్టులను భర్తీ చేస్తున్నట్లు ప్రిన్సిపాల్ రాజేంద్ర ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం వివిధ పోస్టుల వారీగా మొత్తం 20 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఆసక్తి గల వారు ఈనెల 23లోగా కళాశాలలో దరఖాస్తులు చేసుకోవాలని, 24వ తేదీన ఒరిజినల్ సర్టిఫికెట్లతో డెమో పరీక్షకు రావాలని సూచించారు.
ఎంవీఎస్‌లో గెస్టు అధ్యాపకుల పోస్టులు..
జిల్లాకేంద్రంలోని ఎంవీఎస్ డిగ్రీ కళాశాలలో వివిధ కోర్సుల వారీగా అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని ప్రిన్సిపాల్ పద్మావతి ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 23లోగా కళాశాలలో దరఖాస్తులు చేసుకోవాలని, ఈనెల 24న తేదీన నిర్వహించే డెమోకు హాజరుకావాలని సూచించారు.
స్థానిక సమస్యల
పరిష్కారానికి పోరాటం
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: స్థానిక సమస్యల పరిష్కారానికి పోరాడుతామని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎ.రాములు అన్నారు. సోమవారం మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని దివిటిపల్లి డబుల్‌బెడ్ రూం ఇళ్ల కాలనీలో పార్టీ ఆధ్వర్యంలో తిరిగి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కాలనీకి రోడ్డు సౌకర్యం సరిగా లేదన్నారు. వీధి దీపాలు వెలగడం లేదని, తాగునీటి బోరు మరమ్మతుకు గురై మూడు నెలలైనా అధికారులు బాగు చేయడం లేదని ఆరోపించారు. రైల్వేస్టేషన్ కాంపౌండ్‌కు గేటు ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో సీపీఎం పట్టణ కార్యదర్శి చంద్రకాంత్, జిల్లా కమిటీ సభ్యులు కడియాల మోహన్, రాజ్‌కుమార్, నాయకులు భానుప్రసాద్, వరద గాలన్న తదితరులు పాల్గొన్నారు.
భూ హక్కులు కల్పించాలి
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): దళితులకు భూ హక్కులు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో చేపడుతున్న దీక్షలు సోమవారం 8వ రోజు కొనసాగాయి. ఇందులో భాగంగా దీక్ష శిబిరం నుంచి డప్పు వాయిదాలతో అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీగా వెళ్లి అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. ఈసందర్భంగా ఎమ్మార్పీఎస్ దక్షిణ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మల్లేపోగు శ్రీనివాస్ మాట్లాడుతూ అంబేద్కర్ కల్పించ హక్కులు తమకు దక్కడం లేదని అన్నారు. 8 రోజులు పోరాటం చేస్తున్న అధికారులు, ప్రజా ప్రతినిధులు కనీసం స్పందించడం లేదని ఆరోపించారు. దళితుల భూమిని అటవీశాఖ భూమి అని బలవంతంగా లాక్కోవడం అన్యాయమన్నారు. కార్యక్రమంలో వెంకటయ్య, రామబులు, నర్సిములు, తిరుపతయ్య, శివమ్మ, పెంటమ్మ, సుక్కమ్మ, నర్సమ్మ, బాలనాగయ్య, సత్యం, చెన్నయ్య, జైమహేష్, పవన్, శాంతికుమార్, పెంటమ్మ, చెన్నమ్మ, చిన్న నరసమ్మ పాల్గొన్నారు.

అధ్యాపక పోస్టుల కోసం దరఖాస్తుల ఆహ్వానం