
మహబూబ్‌నగర్ రూరల్
మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రస్తుతం మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు (మహబూబ్‌నగర్, జడ్చర్ల, దేవరకద్ర) ఉన్నాయి. మరో నియోజకవర్గంగా మహబూబ్‌నగర్ రూరల్ ఏర్పాటయ్యే అవకాశం ఉంది. మహబూబ్‌నగర్ పరిధిలోని మహబూబ్‌నగర్ రూరల్ మండలం, హన్వాడ, పరిగి నియోజకవర్గంలోని మహమ్మదాబాద్, నారాయణపేట సెగ్మెంట్‌లోని కోయిల్‌కొండ, జడ్చర్ల పరిధిలోని నవాబుపేట మండలాలతో కలిపి మహబూబ్‌నగర్ రూరల్ నియోజకవర్గం ఏర్పాటు చేసే అవకాశం ఉంది. మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి (2011 లెక్కల ప్రకారం జనాభా 2,17,942)ని మహబూబ్‌నగర్ అర్బన్ నియోజకవర్గం చేసే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మండలం జనాభా
మహబూబ్‌నగర్ రూరల్ 42,523
హన్వాడ (మహబూబ్‌నగర్) 55,044
మహమ్మదాబాద్ (పరిగి) 34,087
కోయిల్‌కొండ (నారాయణపేట) 66,721
నవాబుపేట (జడ్చర్ల) 52,061
మొత్తం 2,50,436