
ఆర్టీసీలో డిజిటల్ చెల్లింపులు
స్టేషన్ మహబూబ్‌నగర్: ఆర్టీసీ సంస్థ సైతం సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటుంది. ఓ వైపు చిల్లర సమస్యలకు చెక్ పెడుతూ.. టికెట్ల జారీకి యూపీఐ చెల్లింపులు చేపడుతుంది. మరోవైపు గమ్యం, రిజర్వేషన్ యాప్‌ల ద్వారా ప్రయాణికుడికి ఎంతో వెసులుబాటు కల్పిస్తోంది. ముఖ్యంతో గమ్యం యాప్‌తో రూట్‌ల ప్రకారం బస్సులు ఎక్కడికి, ఏ సమయానికి వెళుతాయనే వివరాలు తెలుసుకోవచ్చు. అదే విధంగా రిజర్వేషన్ చేసుకున్న బస్సు మనం ఎక్కాల్సిన స్టాప్‌కు ఎప్పుడు వస్తుందని, ప్రస్తుతం ఎక్కడో ఉందనే ట్రాకింగ్ సౌకర్యం అందుబాటులో ఉంది. అదే విధంగా ఈ యాప్‌లో మహిళా ప్రయాణికుల భద్రతకు పెద్దపీట వేశారు.
యూపీఐ చెల్లింపులు
ప్రస్తుతం మార్కెట్లో యూపీఐ చెల్లింపుల హవా విపరీతంగా కొనసాగుతోంది. దీంతో ఆర్టీసీ సంస్థ కూడా యూపీఐ చెల్లింపులకు శ్రీకారం చుట్టింది. నెలన్నర నుంచి ఆర్టీసీ బస్సుల్లో టికెట్ల జారీకి యూపీఐ చెల్లింపులు విధానాన్ని అమలుచేస్తున్నారు. మహబూబ్‌నగర్ ఆర్టీసీ రీజియన్‌లోని పది డిపోల పరిధిలోని సూపర్ లగ్జరీ, డీలక్స్, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో పూర్తిస్థాయిలో యూపీఐ చెల్లింపులు చేస్తుండగా పల్లెవెలుగు బస్సుల్లో దాదాపు 50 శాతం వరకు అమలు చేస్తున్నారు. మహబూబ్‌నగర్ రీజియన్‌లో సూపర్ లగ్జరీ 40 బస్సులు, డీలక్స్ 40 బస్సులు, ఎక్స్‌ప్రెస్ 284, పల్లె వెలుగు 494 బస్సులు ఉన్నాయి.
● యూపీఐ ద్వారా టికెట్ల జారీ
● సూపర్ లగ్జరీ, డీలక్స్, ఎక్స్‌ప్రెస్‌లలో పూర్తిస్థాయి అమలు
● పల్లెవెలుగు బస్సుల్లో దాదాపు 50 శాతం
చిల్లర
సమస్యలకు చెక్
ఆర్టీసీ బస్సుల్లో యూపీఐ చెల్లింపులతో ఎంతో వెసులుబాటు లభించనుంది. ముఖ్యంగా టికెట్ల జారీ సమయంలో చిల్లర సమస్యకు పరిష్కారం లభిస్తుంది. అదే విధంగా టికెట్లు ఇవ్వడంలో కొంతమేర సమయం ఆదా అయ్యే అవకాశం ఉంటుంది. ఈ మేరకు ఇప్పటికే గతంలో టికెట్లను జారీ చేసే పాత టిమ్ స్థానంలో ఐ– టిమ్ మెషిన్లు అందుబాటులోకి వచ్చాయి. పూర్తిగా టచ్ స్క్రీన్ ద్వారా ఈ మిషన్లు నడుస్తున్నాయి. యూపీఐ చెల్లింపులు పూర్తయిన వెంటనే మిషన్ టికెట్ జారీ అవుతుంది. ఇప్పటికే ప్రయాణికుల నుంచి యూపీఐ చెల్లింపులకు విశేషమైన ఆదరణ లభిస్తుంది. ముఖ్యంగా హైదరాబాద్ రూట్‌లో యూపీఏ చెల్లింపులు ఎక్కువగా జరుగుతున్నట్లు తెలుస్తోంది,
●
త్వరలో
పూర్తిస్థాయిలో అమలు
ఆర్టీసీ బస్సుల్లో యూపీఐ చెల్లింపులు ప్రారంభమయ్యాయి. ముందుగా సూపర్ లగ్జరీ, డీలక్స్, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో వందశాతం యూపీఐ చెల్లింపులు జరుగుతున్నాయి. పల్లె వెలుగు బస్సుల్లో 50 శాతం ఉందని, భవిష్యత్తులో ఈ బస్సుల్లో కూడా పూర్తిస్థాయిలో అమలు చేయడం జరుగుతుంది. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ఆర్టీసీ సంస్థ పనిచేస్తుంది. – లక్ష్మిధర్మ,
ఆర్టీసీ డివిజనల్ మేనేజర్, మహబూబ్‌నగర్

ఆర్టీసీలో డిజిటల్ చెల్లింపులు