
జీజీహెచ్‌లో గాడితప్పిన పాలన
పాలమూరు: జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాలకు అనుబంధ ఆస్పత్రి (జీజీహెచ్)కి గత కొన్నేళ్లుగా ఇన్‌చార్జీలే దిక్కు అవుతున్నారు. ఇప్పుడైతే ఏకంగా ఇన్‌చార్జ్ కూడా కాకుండా తాత్కాలికంగా సూపరింటెండెంట్ కొనసాగుతుండటంతో వ్యవస్థ పూర్తిగా గాడి తప్పుతోంది. పూర్తిస్థాయి సూపరింటెండెంట్‌ను ప్రభుత్వం నియమించకపోవడం వల్ల వైద్యులు, ఇతర సిబ్బంది పనితీరుపై పర్యవేక్షణ పూర్తిగా కొరవడింది. ఫలితంగా గత కొన్ని రోజుల నుంచి ఆస్పత్రిలో పాలన పూర్తిగా పడకేసింది. ప్రస్తుతం అనస్తీ షియా హెచ్‌వోడీ డాక్టర్ మాధవి తాత్కాలిక సూప రింటెండెంట్‌గా కొనసాగుతుండగా.. దీనిపై ఎలాంటి అధికారిక ఉత్తర్వులు రాకపోవడం గమనార్హం.
వైద్యులు, సిబ్బందిపై కనిపించని పర్యవేక్షణ
పూర్తిస్థాయి సూపరింటెండెంట్ లేకపోవడంతో తాత్కాలిక బాధ్యతలకే పరిమితం అవడం వల్ల జనరల్ ఆస్పత్రి రోజురోజుకూ అధ్వానంగా తయా రవుతోంది. పూర్తిస్థాయి, కాంట్రాక్టు వైద్యులు, హౌజ్ సర్జన్లు, ఎస్‌ఆర్‌లు, పరిపాలన సిబ్బంది ఎవరూ సమయపాలన అసలు పాటించడం లేదని విమర్శ లు చాలా వస్తున్నాయి. ఓపీ ఉదయం 9 గంటలకు మొదలు కాగా 10 గంటలకు వచ్చి బయోమెట్రిక్ నమోదు చేసి, మధ్యాహ్నం 12 గంటల తర్వాత ప్రైవేట్ క్లినిక్‌లకు వెళ్లిపోతున్నారు. ప్రధానంగా ఏ విభాగం ఎక్కడ ఉంది.. ఏ సేవలు ఎక్కడ అందుతాయో.. అని చెప్పడానికి ఉపయోగించే హెల్ప్‌డెస్క్ ఏమాత్రం అందడం లేదు. దీంతో రోగులు, ఆడ్మిట్ అయిన వారి కోసం వచ్చిన అటెండర్లు పలు రకాల విభాగాల కోసం ఇబ్బందులు పడుతున్నారు. ఇక పారిశుద్ధ్యం అయితే పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు. వర్షం వస్తే వార్డులలో నీరు రావడం, సక్రమంగా శుభ్రం చేయకపోవడం, టాయిలెట్స్ దుర్వాసన వస్తున్నాయి. బయో వ్యర్థాల నిర్వహణ సక్రమంగా లేక దుర్వాసన వెదజల్లుతోంది.
వైద్యుల సమయపాలనపై దృష్టిపెట్టని వైనం