
బయట తీసుకోమన్నారు..
కడుపులో నొప్పి వస్తుందని ఆస్పత్రికి ఉదయం 10 గంటలకు వచ్చాను. దాదాపు గంట తర్వాత పరీక్షించిన వైద్యుడు స్టోన్స్ ఉన్నాయని చెబితే అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేసుకోవడానికి వెళ్లాను. దాదాపు రెండు గంటల తర్వాత స్కాన్ చేశారు. డాక్టర్ రాసిన ఐదు రకాల మందులలో మూడు రకాలు ఇచ్చి.. మిగతావి బయట తీసుకోమన్నారు. – అక్రమ్, గోల్‌మజీద్
పరీక్షలు చేయించలేదు..
రెండు రోజుల నుంచి చెస్ట్‌లో బాగా పెయిన్ వస్తోందని ఉదయం 9 గంటలకు వచ్చాను. ఓపీ తీసుకుని 2 గంటల పాటు ఉండి డాక్టర్‌కు చూపించుకున్నాను. ఎందుకు నొప్పి వస్తుంది? ఈసీజీ, ఇతర పరీక్షలు ఏవీ చేయించకుండానే మూడు రకాల ట్యాబ్‌లెట్లు ఇచ్చారు. ఇందులో రెండు రకాలు ఇచ్చి.. మరొకటి ఇవ్వలేదు.
– రాజు, తీర్మాలాపూర్
నిత్యం పర్యవేక్షిస్తాం..
ప్రస్తుతం సూపరింటెండెంట్ బదిలీ కావడంతో కొంత ఇబ్బంది ఉంది. దీనికి తోడు అసిస్టెంట్, అసోసియేట్లకు పదోన్నతులు ఉండటం వల్ల వారు ఆప్షన్స్ పెట్టుకునే పనిలో బిజీబిజీగా ఉన్నారు. ఓపీ సమయపాలన విషయంపై వైద్యులందరికీ స్పష్టమైన ఆదేశాలిస్తాం. ప్రతి ఒక్క సీనియర్ వైద్యుడు తప్పక ఓపీ టైంలో డ్యూటీలో ఉండాలి. బయోమెట్రిక్ విధానం పరిశీలించి సక్రమంగా విధులకు హాజరు కాకపోతే చర్యలు తీసుకుంటాం. మందుల కొరతపై దృష్టి సారించి.. ఇండెంట్ పెడతాం.
– డాక్టర్ రమేష్, డైరెక్టర్, మెడికల్ కళాశాల
చిట్టిలో రాసింది ఏదీ ఇవ్వలేదు..
కొన్ని రోజుల నుంచి రెండు కళ్లలో నీరు కారుతుందని కంటి డాక్టర్‌కు చూపించుకోవడానికి వచ్చాను. ఉదయం 9 గంటల నుంచి క్యూలైన్‌లో నిలబడితే ఒంటి గంటకు చూశారు. వాళ్లు రాసిన మందుల చిట్టి తీసుకొని వెళితే.. ఏ ఒక్క రకంగా కూడా లేవని బయట తీసుకోవాలని చెప్పారు.
– జరీనా బేగం, కొత్త గంజ్
●

బయట తీసుకోమన్నారు..

బయట తీసుకోమన్నారు..

బయట తీసుకోమన్నారు..