
నేత్రపర్వంగా రథోత్సవం
కోటకదిరలో శనివారం శ్రీ సద్గురు చంద్రమౌళీశ్వర పురుషోత్తమానంద సరస్వతి స్వామివారి రథోత్సవం నేత్రపర్వంగా సాగింది. స్వామివారి 115వ సప్తాహ ఆరాధన మహోత్సవాల్లో భాగంగా ఈ వేడుకను నిర్వహించారు. శోభాయమానంగా అలంకరించిన రథంపై స్వామివారి విగ్రహాన్ని ఉంచి ముందుగా ప్రత్యేక పూజలు అనంతరం సంప్రదాయం ప్రకారం కుంభం పోసి.. రథోత్సవానికి శ్రీకారం చుట్టారు. ఆలయం చుట్టూ రెండుసార్లు రథాన్ని లాగారు. రథోత్సవ అనంతరం స్వామివారికి పల్లకీసేవ చేపట్టారు. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా రూ.20 లక్షలు ముడా నిధులతో నిర్మించనున్న స్వామివారి ఆలయంలో షెడ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. సద్గురు చంద్రమౌళీశ్వర పురుషోత్తమానంద సరస్వతి స్వామివారి అనుగ్రహం అందరిపైన ఉండాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.
– మహబూబ్‌నగర్ రూరల్

నేత్రపర్వంగా రథోత్సవం