
కమిటీల పనితీరుపైన్యాయమూర్తి సమీక్ష
పాలమూరు: నల్సాకు సంబంధించిన ఎస్‌ఓపీ ప్రకారం ఏర్పాటు న్యాయస్థానం పరిధిలో ఏ ర్పాటు చేసిన ఐదు కమిటీల పనితీరు బాగుండాలని జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి బి. పాపిరెడ్డి అన్నారు. జిల్లా కోర్టు ఆవరణలో శని వారం నల్సా, డాన్ కమిటీ, జాగృతి, సంవద్ కమిటీల సభ్యులతో ప్రధాన న్యాయమూర్తి బి.పాపిరెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కమిటీలలో ఉండే ప్రతి ఒక్కరూ వాటి ని బంధనల ప్రకారం పని చేయాల్సి ఉంటుందని సూచించారు. కార్యక్రమంలో న్యాయమూర్తు లు కల్యాణ్ చక్రవర్తి, రాచపూడి శ్రీదేవి, ఇంది ర, ఐదు కమిటీల సభ్యులు, ప్యానల్ న్యాయవాదులు, పారాలీగల్ వలంటీర్లు పాల్గొన్నారు.
ఓవర్సీస్ విద్యకోసం దరఖాస్తులు
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: అంబేద్కర్ ఓవర్సీస్ విద్య విదేశీ పథకంలో భాగంగా సీట్ల సంఖ్యను ప్రభుత్వం పెంచిందని, దరఖాస్తు చేసుకునేందుకు మరోసారి అవకాశం ఇచ్చిందని ఎస్సీ సంక్షేమశాఖ డీడీ సునీత ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల వారు వచ్చేనెల 31 లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. అర్హులైన ఎస్సీ విద్యార్థులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
దరఖాస్తుల ఆహ్వానం
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): జడ్చర్ల ఏరియా ఆస్పత్రిలో ఒప్పంద ప్రాతిపదికన వైద్యుల పోస్టుల భర్తీకి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు కలెక్టర్ విజయేందిర శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జడ్చర్లలోని ఏరియా ఆస్పత్రిలో సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ 1, సివిల్ అసిస్టెంట్ సర్జన్ 1 పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిన ఏడాది కాలానికి భర్తీ చేస్తామన్నారు. అభ్యర్థుల సేవల నాణ్యతపై ఆధారపడి నియా మక కాలాన్ని పొడిగించే అవకాశం ఉందన్నారు. అలాగే సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ పోస్టు కోసం అనస్తీషియా, జనరల్ సర్జన్, ఫారెన్సిక్ మెడిసిన్ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని, ఈ పోస్టులో ఎంపికై న వారికి రూ.లక్ష వేతనం ఉంటుందన్నారు. అదే సివిల్ అసిస్టెంట్ సర్జన్ ఒక పోస్టుకు ఎంబీబీఎస్ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని, వీరికి జీతం రూ.52,351 చెల్లిస్తామన్నారు. 46 ఏళ్లలోపు అభ్యర్థులు అర్హులని, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఐదేళ్లు, మాజీ సైనికులకు మూడేళ్లు , దివ్యాంగులకు పదేళ్లు వయో పరిమితి సడలింపు ఉందని, దరఖాస్తులను స్వయంగా లేదా రిజిస్టర్డ్ పోస్టు ద్వారా సూపరింటెండెంట్, జిల్లా హెడ్‌క్వార్టర్, ఏరియా ఆస్పత్రి, జడ్చర్లకు ఈ నెల 28లోగా పంపాలని సూచించారు.
ఆర్టీసీలో అప్రెంటిస్ శిక్షణకు దరఖాస్తుల స్వీకరణ
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: మహబూబ్‌నగర్ రీజియన్ పరిధిలోని వివిధ ఆర్టీసీ డిపోలలో ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ విభాగాల్లో మూడేళ్ల అప్రెంటిస్ శిక్షణకు ఆసక్తి గల ఉమ్మడి జిల్లాకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని ఆర్‌ఎం సంతోష్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. నాగర్‌కర్నూ ల్, గద్వాల, వనపర్తి, మహబూబ్‌నగర్, నారా యణపేటకు చెందిన వారు గ్రాడ్యుయేషన్ ఇంజినీరింగ్‌ఐటీ/ కంప్యూటర్ సైన్స్/ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ/ గణితం కోర్సులలో లేదా డిప్లొమా 2021 నుంచి పాసై ఉండాలన్నారు. ఇక నాన్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్‌కు బీఏ, బీకాం, బీబీఏ, బీసీఏలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులన్నారు. దరఖాస్తులను నాట్స్ (నేషనల్ అప్రెంటిస్ ట్రైనింగ్ స్కీం) https://nats. education.gov.in వెబ్‌పోర్టల్‌లో ఈ నెల 21 నుంచి 27 వరకు రిజిస్టర్ చేసుకోవాలన్నారు. మెరిట్ ప్రాతిపదికన అభ్యర్థుల ఎంపిక ఉంటుందని, శిక్షణ కాలంలో ప్రతినెలా స్టైఫండ్ ఇస్తామని తెలిపారు.