
‘అమరవీరుల త్యాగాలతోనే తెలంగాణ’
తెలకపల్లి: అమరవీరుల త్యాగాలతోనే ప్రత్యేక రాష్ట్రం వచ్చిందని ఎకై ్సజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మండలంలోని అలేరులో ఏర్పాటు చేసిన తెలంగాణ అమరవీరుల స్తూపాన్ని ఆయన సోమవారం ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్‌రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకునే నాటికి తెలంగాణ అప్పు కేవలం రూ.64కోట్లు ఉంటే.. ఆయన పదేళ్ల పాలన పూర్తి చేసుకునే నాటికి రూ.8 లక్షల కోట్లకు పెంచారని ఆరోపించారు. లక్షలాది మంది ఉద్యమాల్లో పాల్గొనడంతో పాటు వేలాది మంది అమరులై సాధించుకున్న తెలంగాణను కేసీఆర్ కుటుంబం దోచుకుందని మండిపడ్డారు. ప్రతి మండల కేంద్రంలో అమరవీరుల స్థూపాలు, ప్రతి గ్రామంలో అంబేడ్కర్, గాంధీ విగ్రహాలు ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
కలిసి అభివృద్ధి చేసుకుందాం
ప్రజా ప్రభుత్వంలో ప్రతి పౌరుడు భాగస్వామ్యం వహించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తుందని, వాటిని ప్రతి ఇంటికి చేర్చాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు. రైతు భరోసా, సన్న వడ్లకు బోనస్, రైతు రుణమాఫీ వంటి పథకాలతో అన్నదాతలకు అండగా నిలుస్తున్నామని తెలిపారు. అంతకు ముందు బోనాలు, డప్పులో గ్రామస్తులు మంత్రికి స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు దామోదర్‌రెడ్డి, కోదండరాం, ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణరెడ్డి, రాజేష్‌రెడ్డి, సింగిల్‌విండో వైస్ చైర్మన్ మామిళ్లపల్లి యాదయ్య తదితరులు పాల్గొన్నారు.
అమరవీరుల స్థూపాన్ని
ఆవిష్కరిస్తున్న ఎకై ్సజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
ఎకై ్సజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు