
రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
కల్వకుర్తి టౌన్: బైక్ అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన ఘటనలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. ఈ ఘటన సోమవారం కల్వకుర్తిలో చోటుచేసుకుంది. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాలిలా.. మున్సిపాలిటీలోని జేపీనగర్ వద్ద నివాసముండే భాను (33) తన సొంత పనుల నిమిత్తం పట్టణానికి బైక్‌పై వచ్చాడు. పనులు ముగించుకొని తిరిగి ఇంటికి వెళుతుండగా గాంధీనగర్‌లోని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం వద్ద బైక్ అదుపుతప్పి.. పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టాడు. తీవ్రగాయాలైన యువకుడిని స్థానికులు వెంటనే చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లుగా వైద్యులు తెలిపారు. మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రిలోని మార్చురీకి తరలించామని, ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని, అందిన వెంటనే దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు. మృతుడికి భార్యతో పాటుగా నెల వయస్సున్న కుమారుడు ఉన్నారు.
మనస్తాపంతో పురుగుమందు తాగాడు
కల్వకుర్తి రూరల్: మండలంలోని గుండూరుకు చెందిన మొగిలి శివయ్య (74) పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ఒడిగట్టిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. శివయ్య ఆదివారం పీర్ల వద్దకు వెళ్లి పీర్ల ఊరేగింపు చూసే సమయంలో కిందపడి గాయాలపాలయ్యాడు. ఇంటికి చేరుకుని తాను అన్నివిధాలుగా ఇబ్బందులు పడుతున్నానని మదనపడుతూ మనస్తాపానికి గురయ్యాడు. ఇంట్లోనే అర్ధరాత్రి పురుగుల మందు తాగి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. వేకువజామున కుటుంబ సభ్యులు గమనించి కల్వకుర్తి ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఉదయం 7గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మాధవరెడ్డి తెలిపారు.
చికిత్స పొందుతూ వృద్ధుడి మృతి

రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం