
ఐదేళ్ల ప్రణాళిక..
జిల్లాలో పీఎం జుగా మిషన్ ద్వారా ఐదేళ్లలో వెనకబడిన ప్రాంతాల్లో సమగ్ర అభివృద్ధికి శ్రీకారం చుట్టనున్నారు. ఇందులో భాగంగా జిల్లాలోని 34 గ్రామాల్లో 19 ప్రభుత్వ శాఖల సమన్వయంతో అభివృద్ధి పనులు చేపడతారు. ఇప్పటికే ఆయా గ్రామాల్లో శిబిరాల్లో పాల్గొనే అధికారులు అక్కడ గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటికి గల కారణాలు, అక్కడ ఉన్న మౌలిక సదుపాయాలు, విద్య, వైద్యం, సంరక్షణ వంటివి పరిశీలించి వాటిని నమోదు చేసి ఆయా శాఖల అధిపతుల ద్వారా అక్కడి పనులకు అయ్యే ఖర్చు ఎంత.. అనే అంచనాలు రూపొందిస్తారు. అనంతరం జిల్లా గిరిజనాభివృద్ధి అధికారికి పంపుతారు. వాటన్నింటినీ కలెక్టర్ ద్వారా పీఎం జుగా మిషన్ అధికారులకు అందజేసిన అనంతరం వెను వెంటనే వాటికి అయ్యే నిధులు మంజూరు చేసి అభివృద్ధి పనులు చేపడుతారు. ఈ పనులన్నీ 2029 నాటికి పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు.