స్టేషన్ మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ టాస్క్‌సెంటర్‌ను హైదరాబాద్‌లోని స్కిల్ యూనివర్సిటీకి అనుసంధానం చేస్తామని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రం రైల్వేస్టేషన్ చౌరస్తా సమీపంలోని మున్సిపల్ కాంప్లెక్స్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ సెంటర్ (టాస్క్) శిక్షణకేంద్రాన్ని శుక్రవారం ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పెద్దపల్లి తర్వాత రెండోది మన మహబూబ్‌నగర్ టాస్క్‌సెంటర్ అని అన్నారు. టాస్క్‌సెంటర్‌లో అన్ని రకాల కోర్సులకు అడ్వాన్స్ కోచింగ్ ఇస్తారని, ఇంటర్మీడియట్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన విద్యార్థులు ఎవరైనా కేంద్రంలో శిక్షణ పొందవచ్చన్నారు. టాస్క్ శిక్షణ కేంద్రంలో మొదటి బ్యాచ్‌లో 50 మందికి అవకాశం కల్పించారన్నారు. మెట్టుగడ్డలోని వెజ్, నాన్ వెజ్ మార్కెట్‌కు కేటాయించిన స్థలంలో టాస్క్ సెంటర్ కోసం శాశ్వత భవనాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాదిలోగా ఈ నూతన భవనం అందుబాటులోకి వస్తుందన్నారు. మహబూబ్‌నగర్‌ను ఎడ్యుకేషనల్, స్కిల్ డెవలప్‌మెంట్ హబ్‌గా మార్చడానికి తనతో పాటు సీఎం రేవంత్‌రెడ్డి కృషి చేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థుల కోసం టాస్క్ శిక్షణకేంద్రంలో అనేక కొత్త కోర్సులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామన్నారు. అంతకుముందు పీయూ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ జీఎన్ శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యాభివృద్ధికి ఎమ్మెల్యే కృషి చేస్తున్నట్లు తెలిపారు. టాస్క్ సీఈఓ శ్రీకాంత్ సిన్హా మాట్లాడుతూ ఎమ్మెల్యే కృషి ఫలితంగానే మహబూబ్‌నగర్‌కు టాస్క్ సెంటర్ వచ్చిందన్నారు. కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ బెక్కరి అనిత, మున్సిపల్ కమిషనర్ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, సుంకిరెడ్డి రాఘవేందర్, డీఐఈఓ కౌసర్ జహాన్, ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ భగవంతాచారి, ఒకేషనల్ ప్రిన్సిపాల్ నర్సింలు, నాయకులు సీజే బెనహర్, రాములుయాదవ్, రాఘవేందర్ పాల్గొన్నారు.
‘ఫస్ట్’ కార్యక్రమాలు భేష్
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: ‘మహబూబ్‌నగర్ ఫస్ట్’ కార్యక్రమాలు బాగున్నాయని టాస్క్ సీఈఓ శ్రీకాంత్‌సిన్హా కితాబునిచ్చారు. శుక్రవారం స్థానిక బీకేరెడ్డి కాలనీలోని నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే సొంత నిధులతో ఈ కేంద్రం ఏర్పాటు చేయడమే గాక ప్రముఖ విద్యా సంస్థలను మహబూబ్‌నగర్‌కు తీసుకొని రావడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో టాస్క్ సీఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్, మహబూబ్‌నగర్ ఫస్ట్ – నవరత్నాలు పర్యవేక్షకులు గుండా మనోహర్, ఇన్‌చార్జ్ నిజలింగప్ప, జీజీహెచ్ అభివృద్ధి కమిటీ సభ్యుడు బెజ్జుగం రాఘవేందర్ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి
మహబూబ్‌నగర్‌లో టాస్క్ సెంటర్‌ప్రారంభం