ట్రాక్టర్ బోల్తా : డ్రైవర్ మృతి
ఎర్రవల్లి: జాతీయ రహదారిపై ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తా పడి డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందిన ఘటన బుధవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. రాజోలి మండల పరిధిలోని తుమ్మిళ్ల గ్రామానికి చెందిన కుర్వ వెంకటేశ్ ట్రాక్టర్‌పై పనినిమిత్తం ఎర్రవల్లికి బయలుదేరాడు. ఈ క్రమంలో కొట్టం కాలేజీ సమీపంలో ట్రాక్టర్ ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ప్రమాదంలో వెంకటేశ్‌కు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మరణించాడు. విషయం తెలుసుకున్న ఇటిక్యాల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గద్వాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
20 క్వింటాళ్ల
రేషన్ బియ్యం పట్టివేత
మక్తల్: మండలంలో అక్రమంగా తరలిస్తున్న 20 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. నర్వ మండలం పెద్దకడ్మూర్ గ్రామంలో ఎరుకలి నర్సింహ తన ఇంట్లో 20 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని అక్రమంగా దాచి ఉంచాడు. సమాచారం అందుకున్న నర్వ పోలీసులు తనిఖీలు నిర్వహించి బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ కుర్మయ్య తెలిపారు.


