ప్రజలకు సేవ చేయాలని..
రైతు కుటుంబంలో పుట్టినప్పటికీ బీటెక్ చదివి నాలుగేళ్ల పాటు సాఫ్ట్‌వేర్ ఇంజినీరు ఉద్యోగం చేశాను. గ్రామ ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చాను. సర్పంచ్‌గా పోటీచేస్తే ప్రజలు ఆశీర్వదించి పట్టం కట్టారు. గ్రామాభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తా.
– ఆంజనేయులు, సర్పంచ్,
జీడిపల్లి, కల్వకుర్తి మండలం
పీయూలో విద్యార్థి నాయకుడిగా పనిచేసిన నేను గత పాలకవర్గంలో ఉపసర్పంచ్‌గా పనిచేశా. తనపై నమ్మకంతో సర్పంచ్ పదవిని కట్టబెట్టిన గ్రామస్తులకు రుణపడి ఉంటా. అందరి నమ్మకాన్ని నిలబెట్టుకుంటా. గ్రామ పెద్దలు, యువత సహకారంతో గ్రామాన్ని అన్నివిధాలా తీర్చిదిద్దుతా.
– బీసం నాగరాజు, సర్పంచ్,
రాంపూర్, నర్వ మండలం
ప్రజలకు సేవ చేయాలని..


