నాడు భర్త... నేడు భార్య
● ఎంపీపీ, సర్పంచ్ రెండు పదవులు ‘చెరోసారి’
అడ్డాకుల: మూసాపేట మండలం కొమిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన దంపతులు ఎంపీపీ, సర్పంచ్ పదవులను చేజిక్కించుకుని రాజకీయాల్లో తమకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. గ్రామానికి చెందిన బగ్గి కృష్ణయ్య, కమలమ్మ దంపతులు. 1994లో బగ్గి కృష్ణయ్య కొమిరెడ్డిపల్లి సర్పంచ్‌గా విజయం సాధించారు. తర్వాత 2005లో ఆయన ఎంపీటీసీగా గెలిచి ఉమ్మడి అడ్డాకుల మండల ఎంపీపీగా రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత 2014లో ఆయన భార్య కమలమ్మ కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపీటీసీగా గెలుపొంది ఉమ్మడి అడ్డాకుల మండల ఎంపీపీగా పనిచేశారు. తాజాగా జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కమలమ్మ సర్పంచ్‌గా గెలుపొందారు. భర్త మొదట సర్పంచ్‌గా పనిచేసి తర్వాత ఎంపీపీ అయ్యారు. భార్య మొదట ఎంపీపీగా పనిచేసి ఇప్పుడు సర్పంచ్‌గా విజయం సాధించారు. దంపతులిద్దరు ఎంపీపీ, సర్పంచ్ చెరోసారి దక్కించుకోవడం మండల వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఒకే కుటుంబంలో దంపతులిద్దరు ముఖ్యమైన పదవులను అధిరోహించడం విశేషం.
నాడు భర్త... నేడు భార్య


