
జీజీహెచ్‌లోకి వెల్‌నెస్ సెంటర్
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: పాత డీఎంహెచ్‌ఓ కార్యాలయంలోని మొదటి అంతస్తులో ఉన్న వెల్‌నెస్ సెంటర్‌ను త్వరలో జీజీహెచ్ ఆవరణకు తరలించనున్నారు. ఈ మేరకు మంగళవారం జిల్లా ప్రధాన ఆస్పత్రిలోని వివిధ గదులను డీఎంహెచ్‌ఓ డా.కృష్ణ, సూపరింటెండెంట్ డా.సంపత్‌కుమార్‌తో పాటు సీనియర్ సిటిజన్ ఫోరం సభ్యులు పరిశీలించారు. చివరకు ఈ ఆస్పత్రి వెనుక భాగంలోని రెండు పెద్ద గదులను ఎంపిక చేశారు. కార్యక్రమంలో ఆర్‌ఎంఓ జరీనా, ఫోరం అధ్యక్షుడు జగపతిరావు, ప్రధాన కార్యదర్శి నస్కంటి నాగభూషణం, సభ్యులు రాజసింహుడు, వెంకట్, తెలంగాణ సెంట్రల్ పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు సాయిల్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.