
దేశ సమగ్రతకు యువత పోరాడాలి
మాగనూర్(మక్తల్): దేశ సమగ్రత కోసం యువత సంఘటితంగా పోరాడాలని ప్రొ. జగన్మోహన్‌సింగ్, ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య పిలుపునిచ్చారు. సోమవారం మక్తల్‌లోని నారాయణపేట చౌరస్తా వద్ద భగత్‌సింగ్ విగ్రహాన్ని వారితో పాటు ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి కలిసి ఆవిష్కరించి అనంతరం నిర్వహించిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. దేశ సామాజిక పరిస్థితుల్లో భగత్‌సింగ్ స్థాపించిన నవజవాన్ సభ క్రియాశీలక పాత్ర వహించిందన్నారు. భగత్‌సింగ్ ఆశయ సాధనకు కృషి చేయాలని కోరారు. అనంతరం గుమ్మడి నర్సయ్య మాట్లాడుతూ.. బ్రిటీష్ వారి దుర్మార్గానికి బలైన త్యాగమూర్తి భగత్‌సింగ్ అని కొనియాడారు. కార్యక్రమంలో సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్, పీడీఎస్ యూ, పీవైఎల్ నాయకులు కిరణ్, భాస్కర్, శారద, రాజు, ఆనంద్, సంధ్య తదితరులు పాల్గొన్నారు.