
అగ్గి.. బుగ్గి
జిల్లాలో ఏటేటా పెరుగుతున్న అగ్ని ప్రమాదాలు
జిల్లాలో అగ్ని ప్రమాదాలు, నష్టాలు ఇలా..
మహబూబ్‌నగర్ క్రైం: వేసవి కాలం వచ్చేసింది.. రోజురోజుకూ ఎండలు ముదురుతున్నాయి.. పెరుగుతున్న వేసవితాపం అగ్ని ప్రమాదాలకు ఆజ్యం పోసేలా పనిచేస్తుంది. ఈ నేపథ్యంలో ప్రమాదాలు సంభవించే అవకాశాలు రెట్టింపు అవుతున్నాయి. ఇప్పటికే జిల్లాలో ఏటా వేసవిలోనే అగ్ని ప్రమాదాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి. ఆయా ఘటనలు అపార నష్టాలు మిగుల్చుతున్నాయి. అసలు ప్రమాదాలకే ఆస్కారం లేకుండా అప్రమత్తమైతే నష్ట తీవ్రతను తగ్గించవచ్చు. ఈ విషయమై జిల్లా అగ్నిమాపక శాఖ అధికారులు ఎప్పటికప్పుడు ప్రజలను చైతన్యం చేయడంతోపాటు ప్రమాదాలపై అవగాహన కల్పించారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో జిల్లాలోని అగ్నిమాపక కేంద్రాల నుంచి ఫైర్ ఇంజిన్‌లు సంఘటన స్థలాలకు సమయానికి చేరుకోని మంటలు ఆర్పడంపై దృష్టి పెట్టింది. ఒకవేళ జిల్లాలో ఎక్కడైనా ప్రమాదం సంభవిస్తే వెంటనే ఆలస్యం చేయకుండా టోల్ ఫ్రీ నంబర్లు 101, 100 సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు.
కేంద్రాల ఏర్పాటులో నిర్లక్ష్యం
అగ్రిమాపక కేంద్రాల ఏర్పాటులో మాత్రం నిర్లక్ష్యం వహిస్తున్నారు. ప్రమాదాలు చోటుచేసుకున్నప్పుడల్లా కంటితుడుపు చర్యగా నేతలు, అధికారులు పరామర్శించి వెళ్లిపోతారు. ఎంతోకొంత సాయం అందిస్తారు. త్వరలోనే ఆయా ప్రాంతాల్లో అగ్నిమాపక కేంద్రాలను ఏర్పాటు చేయిస్తామని హామీలు గుప్పిస్తారు. ఆ తర్వాత ఎలాంటి ఉలుకు పలుకు ఉండదు. తిరిగి ప్రమాదాలు చోటుచేసుకున్నప్పుడు మళ్లీ మొదటికే వస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పటి నుంచి ఈ కేంద్రాల ఏర్పాటు కలగానే మిగులుతోంది. తెలంగాణ ఏర్పాటు తర్వాత కూడా ప్రతి నియోజకవర్గానికి ఓ కేంద్రం ఏర్పాటు చేస్తాయని ప్రభుత్వం ప్రకటించింది. అయినా కేటాయింపులు ప్రతిపాదనలకే పరిమితమయ్యాయి. కొత్తగా జిల్లాలో దేవరకద్ర నియోజకవర్గంలోని కొత్తకోటలో ఏర్పాటు చేయగా దీంతోపాటు గండేడ్‌లో ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు ఉన్నాయి.
సంభవించిన ఆస్తినష్టం ( రూ.కోట్లలో)
అగ్నిమాపక అధికారులు కాపాడిన ఆస్తి ( రూ.కోట్లలో)
2024లో జరిగిన అగ్ని ప్రమాదాలు
ఈ ఏడాది జరిగిన ప్రమాదాలు
కాపాడిన ఆస్తి (రూ.లక్షల్లో)
27.16
3.02
128
8
56
11
అపార నష్టాలను
మిగిల్చుతున్న ఆయా ఘటనలు
చాలా మండలాల్లో
కనిపించని ఫైర్ స్టేషన్లు
ప్రమాద తీవ్రత పెంచుతున్న దూరభారం
441 గ్రామాలకు నాలుగు వాహనాలే దిక్కు

అగ్గి.. బుగ్గి