
సిబ్బంది తరఫున పోరాడతాం..
సిబ్బంది చిన్నచిన్న తప్పిదాలు చేస్తే వారిని విచారణ చేయాలి.. నోటీసులు ఇవ్వాలి.. కానీ, నేరుగా సస్పెండ్ చేయడం అనేది సిబ్బందిని వేధింపులకు గురిచేయడమే. బాధిత సిబ్బంది తరఫున మేము పోరాటం చేస్తాం. అధికారులు అణచివేత ధోరణి అవలంబించడం సరైంది కాదు. గతంలో ఎప్పుడూ లేని విధంగా అధికారుల వ్యవహారశైలిని ఖండిస్తున్నాం. వేతనాలు పెంచకుండా సిబ్బందిని ఇబ్బందులకు గురిచేయవద్దు.
– రాము, పీయూ ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు
అందరినీ సమానంగా చూస్తాం
పీజీ కళాశాలలో సిబ్బంది నేరుగా సంతకం పెట్టి వెళ్లిపోతున్నట్లు తెలిసింది. అప్పటికే సంతకం పెట్టి బయటికి వెళ్తున్న ఓ సిబ్బందిని ఎక్కడికి వెళ్తున్నావని అడిగా.. సంతకం పెట్టి బయటికి పోతే ఎలా అని సస్పెండ్ చేశాం. ఏ సిబ్బంది పైనా మాకు కోపం లేదు. అందరినీ సమానంగా చూస్తాం. వేతనాల పెంపు కోసం కృషి చేస్తున్నాం. వేసవి సెలవుల్లో నాన్ టీచింగ్ సిబ్బందికి సెలవులు ఉండవు. గతంలో సెలవులు ఎలా ఇచ్చారో నాకు తెలియదు.
– రమేష్‌బాబు, రిజిస్ట్రార్, పీయూ
●

సిబ్బంది తరఫున పోరాడతాం..