
బీసీలకు రాజ్యాధికారం ఇవ్వాల్సిందే: యెన్నం
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాధికారం ఇవ్వాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడి అన్నారు. మంగళవారం వివిధ డివిజన్ల పరిధిలో రూ.1.21 కోట్ల ముడా నిధులతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలైనప్పుడే అన్ని విధాలా న్యాయం జరుగుతుందన్నారు. దీనికోసం పార్టీ లకతీతంగా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామన్నారు.మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టి.ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, ముడా చైర్మన్ కె.లక్ష్మణ్‌యాదవ్, నాయకులు ఎస్.వినోద్‌కుమార్, సిరాజ్‌ఖాద్రీ, రాజేందర్‌రెడ్డి, మనోహర్ , సీజే బెన్‌హర్, వెంకటేశ్‌గౌడ్, దేవేందర్‌రెడ్డి, రామస్వామి, కిరణ్‌కుమార్, ఇమ్మడి పురుషోత్తం, మంజుల, జ్యోతి, శాంతన్నయాదవ్, యాదన్న, రాములు యాదవ్ పాల్గొన్నారు.