
అలంపూర్ ఆలయాల హుండీ లెక్కింపు
అలంపూర్: స్థానిక జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయాల హుండీ లెక్కింపు బుధవారం కొనసాగింది. రెండు ఆలయాల్లోని హుండీని లెక్కించగా రూ.72,95,339 ఆదాయం వచ్చినట్లు ఈఓ పురేందర్ కుమార్ తెలిపారు. దేవాదాయ, ధర్మాదాయశాఖ సహాయ కమిషనర్ మదనేశ్వర్‌రెడ్డి, ఆలయ పాలకమండలి చైర్మన్ నాగేశ్వర్‌రెడ్డి, ఈఓ పురేందర్‌కుమార్ పర్యవేక్షణలో హుండీలు తెరిచారు. మొత్తం 106 రోజులకుగాను అమ్మవారి ఆలయ హుండీలో రూ.60,76,562, స్వామివారి హుండీలో రూ.11,79,888, అన్నదాన సత్రం హుండీతో రూ.38,889 మొత్తం రూ.72,95,339 ఆదాయం సమకూరినట్లు ఈఓ వివరించారు. వీటితోపాటు విదేశీ కరెన్సీ యూఎస్ డాలర్స్–14, మలేషియన్ రింగిట్–7, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఓమాన్ రైల్–1 ఉన్నాయని.. మిశ్రమ బంగారం 56 గ్రాములు, మిశ్రమ వెండి 222 గ్రాములు వచ్చినట్లు పేర్కొన్నారు. హుండీ లెక్కింపు సహాయ కమిషనర్ పర్యవేక్షణలో కొనసాగగా.. గద్వాల, వనపర్తి, కొత్తకోట, కర్నూలుకు చెందిన వివిధ సేవా సంస్థలు పాల్గొన్నాయి.

అలంపూర్ ఆలయాల హుండీ లెక్కింపు